Begin typing your search above and press return to search.
సైన్యంలో చేరే మహిళలకు కన్యత్వ పరీక్షలు రద్దు
By: Tupaki Desk | 23 Aug 2021 3:30 PM GMTఅడవాళ్లు ఇప్పుడు అబలలు కాదు సబలు అని నిరూపిస్తున్నారు. ప్రతీ రంగంలో పురుషులతో దూసుకెళ్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. భూమ్మీదే కాకుండా అంతరిక్షంలోకి వెళ్లి ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఒకప్పడు స్త్రీలను గడప దాటనీయని ప్రభుత్వాలు సైతం వారి మనసు మార్చుకొని వారికి వివిధ రంగాల్లో అవకాశం ఇస్తున్నారు. దీంతో వారు పోలీసు, సైన్యం , ఆర్మీ విభాగాల్లో చేరుతున్నారు. అయితే సైన్యంలో చేరేవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు పురుషుల వరకు ఓకే.. కానీ మహిళలు చేసే పరీక్షలు కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. మొన్నటి వరకు అలాంటి పరీక్షను తప్పని చేసిన ఇండోనేషియా ప్రభుత్వం తాజాగా దీనిని రద్దు చేసింది. ఇంతకీ ఏంటా పరీక్ష..? ఎందుకు రద్దు చేసింది..?
మహిళలు సైన్యంలో చేరడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మనదేశంలో ఇప్పుడిప్పుడే ఆర్మీలో చేరుతున్నారు. కానీ వీదేశాల్లో ఇదివరకే ఆ రంగంలో దూసుకెళ్తున్నారు. అయితే ఇండోనేషియాలోనూ సైన్యం మహిళలు చేరేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో చాలా మంది ఈ రంగంలో పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు శారీరక పిట్ నెస్ సాధించి ఇక్కడి వరకు వస్తున్నారు. కానీ ఆ ప్రభుత్వం సైన్యంలో చేరాలంటే కన్నత్వ పరీక్షలను తప్పని సరి చేసింది. ఇందులో నెగ్గితేనే సైన్యం చేరేందుకు అవకాశం ఇస్తోంది.
ఇక్కడి ప్రభుత్వం కన్నత్వ పరీక్షలను తప్పని చేయడంతో చాలా మంది మహిళలు ఇక్కడి వరకు వచ్చి వెనుకకు తిరిగి వెళ్లిన వారున్నారు. ఎందుకంటే వారు చేసే పరీక్షలు అంత దారుణంగా ఉంటాయని కొందరు ఆరోపించారు. అంటే కన్నత్వ పరీక్షల పేరిట అధికారులు రెండు వేళ్లు పెట్టి లోపలికి చొప్పస్తారు. ఇలా చేయడం వల్ల వారిలో చెప్పుకోలేని బాధ కలుగుతుంది. దీంతో ఆ భాధ భరించలేని కొందరు వెనుకకు తిరిగిపోగా.. కొందరు వాటిని తట్టుకుని సైన్యం చేరారు. అయితే ఒక్కసారి వెనకకు తిరిగి వెళ్లిన వారికి మరోసారి సైన్యంలో చేరేందుకు అవకాశం లేకుండా చేస్తారు.
మానవహక్కలకు భంగా కలిగించే ఈ పరీక్షలతో అనేక విమర్శలు వచ్చాయి. ఇవ అవమానకరంగా ఉండడంతో పాటు వివక్షపూరితంగా ఉన్నాయని కొన్ని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘కన్నత్వ పరీక్షలు, జెండర్ పట్ల జరిగే హింస విధానాలను తిరస్కరించాలి’ అని ఇండోనేషియా హ్యూమన్ రైట్స్ పరిశోధకుడు ఆండ్రియాస్ హాసోర్నో అన్నాడు. గతంలో వీరు సెక్స్ లో పాల్గొన్నారో.. లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తున్నారు. రెండు వేళ్లు పెట్టి ఇలా చేయడం వల్ల వారిలో అనేక బాధ కలుగుతుంది. ఇది వారిని అవమానించే పరీక్షే అని అన్నారు. అంతేకాకుండా ఈ పరీక్షకు శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ 2014లో ప్రకటించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇండోనేషియా ఆర్మీ అధిపతి ఆందిక పెర్కసా, ‘సైన్యంలో చేరాలనుకునే మహిళలకు ఇక కన్నత్వ పరీక్షలు చేయమని ప్రకటించారు. సైన్యంలో చేరే మహిళలకు ఈ పరీక్ష చేయడం అనవసరం. కేవల ఆరోగ్య పరీక్షలను మాత్రమే చేయాలి. ఇకపై సైన్యంలో చేరాలనుకునే మహిళల శారీరక శిక్షణ తీసుకోగల సామర్థ్యాన్ని మాత్రమే అంచనా వేస్తామని చెప్పారు.
సైన్యం తీసుకున్న నిర్ణయంపై ఇండోనేషినయన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైన్యం మంచి నిర్ణయం తీసుకుందంటున్నారు. దీనిని అశాస్త్రీయమైన చర్యగా భావించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. అయితే నౌకాదళం, వైమానిక దళంలోని అధికారులు కూడా ఈ పరీక్షలకు అంతం పలకాలని కోరుతున్నారు. భవిష్యత్తులో సైన్యంలో చేరాలనుకునే మహిళలు వారి పాత్రలకు అనుగుణంగానే పరీక్షలు నిర్వహించాలంటున్నారు.