కన్యత్వం అనే పదానికి చాలా విలువ ఉంది.. మారుతున్న కాలంలో ఆ విలువకు అర్థం మారి ధన విలువగా మారుతోంది. ధన విలువ పెరుగుతుండడంతో డిమాండు పెరుగుతోంది. దీంతో కన్యత్వం అనేది ఒక పెట్టుబడిగా మారిపోయింది. వినడానికి కటువుగా ఉన్నా ఇది నిజం . ప్రస్తుతం రష్యాలో అమ్మాయిలు అదే పెట్టుబడిగా మార్చుకుని ఆస్తులు సమకూర్చుకుంటున్నారు.. విలాసవంతమైన జీవితానికి డబ్బు సంపాదించుకుంటున్నారు. కన్యత్వాన్ని ఆఫర్ చేసేవారు - కొనుగోలు చేసేవారి మధ్య వ్యాపారం కుదిర్చేందుకు దళారులు పెద్దసంఖ్యలో తయారవడంతో భారీ స్థాయి మార్కెట్ ఏర్పడిందక్కడ.
రష్యాలో ఇటీవల కాలంలో కన్యత్వ వేలం ఘటనలు ఎక్కువవుతున్నాయి. గతంలో ఒకటీఅరా ఇలాంటి సంఘటనలు ఉండేవి కానీ.. ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఈ తరహ ఘటనలు రష్యాలో ఎక్కువగా కన్పిస్తున్నాయి. రష్యాలో ప్రత్యేకంగా కన్యత్వాన్ని వేలం వేసుకొనేందుకు వెబ్ సైట్లు వెలిశాయి. కన్యత్వాన్ని వేలం పెట్టేందుకు వేలాది మంది కన్యలు వెబ్‌సైట్లో ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కన్యత్వాన్ని వేలం వేసే ప్రక్రియలో దళారుల ఫీజులు కూడ ఎక్కువగానే ఉన్నాయి.
అపార్టుమెంట్లు కొనుక్కోవడానికి - ఒకేసారి ధనవంతులు అయిపోవడానికి తమ కన్యత్వాన్ని వేలం వేస్తున్నారు. అంతేకాదు.. ‘రైట్ టు ది ఫస్ట్ నైట్' అనేది అక్కడొక ఉద్యమంగా మారుతోంది. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం దళారులు కూడా క్లబ్బులు ఏర్పాటయ్యాయి. 19 ఏళ్లలోపు అందమైన అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉన్న వాళ్లు కావాలంటూ ఇలాంటి క్లబ్బులో ప్రకటనలు ఇస్తున్నారు. తాము కన్యగానే ఉన్నట్లు వేలంలో పాల్గొనే అమ్మాయిలు అవసరమైన వైద్య సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.
కొసమెరుపు: అన్ని వ్యాపారాల్లోనూ మోసం ఉన్నట్లే ఈ కన్యత్వ వ్యాపారంలోనూ చాలా మోసాలు జరుగుతున్నాయట. కొంతమంది నిత్య కన్యలు నకిలీ సర్టిఫికేట్లతో మోసం చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారట.