Begin typing your search above and press return to search.

స్మిత్ vs కోహ్లీ.. క్రికెట్ రారాజు ఇతడేనట..

By:  Tupaki Desk   |   22 Aug 2019 10:42 AM GMT
స్మిత్ vs కోహ్లీ.. క్రికెట్ రారాజు ఇతడేనట..
X
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఎవరు గొప్ప ఆటగాడు.. ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో ప్రధానంగా రెండే పేర్లు వినపడుతున్నాయి. ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల జాబితాలో మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ 1 ర్యాంకులో ఉండగా.. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ యాషెస్ సిరీస్ లో వరుస సెంచరీలతో రెండో స్థానానికి ఎగబాకాడు.

అయితే ఇంగ్లండ్ బౌలర్లను కాచుకొని సెంచరీలు చేసిన స్మిత్ నంబర్ 1 క్రికెటర్ అంటూ మీడియా, మాజీలు కొనియాడుతున్న వేళ భారత మాజీ డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయంపై స్పందించారు. పోలికలు చెప్పి మరీ ఎవరు బెస్ట్ స్పష్టం చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ‘‘ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీనే నంబర్ 1 ఆటగాడు.. స్మిత్ పోటీకి వచ్చినా అతడి ఆటతీరుకు, కోహ్లీ క్లాస్ ఆటతీరుకు ఎంతో తేడా.. స్మిత్ బ్యాటింగ్ శైలిలో తడబాటు ఉంటుంది. అందుకే అర్చర్ బౌన్సర్ కు గాయపడ్డాడు. విరాట్ మాత్రం చూడచక్కని బ్యాటింగ్ శైలితో శతకాల మీద శతకాలు సాధిస్తున్నాడు. విరాట్ బౌలర్లను కాచుకునే తీరు అమోఘం.. అందుకే గాయాలు పెద్దగా కావు. ప్రస్తుతం విరాటే నంబర్1. సచిన్ రికార్డుల బద్దలుకొట్టే సత్తా విరాట్ కే ఉంది’’ అని వీరూ కుండబద్దలు కొట్టాడు.