Begin typing your search above and press return to search.
వీడు శ్రీకృష్ణుడి అవతారమట.. బందీలుగా 168 మంది అమ్మాయిలు
By: Tupaki Desk | 29 Feb 2020 8:30 AM GMTఫోటో చూస్తే.. పెద్ద మనిషిలా కనిపిస్తాడు. చావుకు దగ్గరగా ఉన్నట్లు అనిపించే ఈ ముసలోడి అసలు యవ్వారం తెలిస్తే షాక్ తినటం ఖాయం. ఇక.. వాడి బాధితుల మాటలు వింటే.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. సంచలనంగా మారిన ఈ దరిద్రపుగొట్టు ముసలోడి యవ్వారాన్ని మన చుట్టూ ఇలాంటి నీచులు కూడా ఉన్నారా? అన్న సందేహం కలుగక మానదు.
వీరేంద్ర దీక్షిత్. పేరు విన్నంతనే సౌండ్ బాగుందన్న భావన కలుగుతుంది. మనిషిని చూసినా అలాంటి ఫీలింగే కలుగుతుంది. కానీ.. నోరు విప్పి అతగాడి మాటలు విన్నంతనే చర్రుమనటమే కాదు.. లాగి పెట్టి ఒక్కటివ్వాలనిపిస్తుంది. ఇక.. ఇతగాడి మాటల ప్రభావానికి లోనై.. తమ బతుకుల్ని బుగ్గి చేసుకుంటున్న వారిని చూసినప్పుడు.. ఆ అమాయకపు జీవుల తల్లిదండ్రుల వేదన విన్నప్పుడు.. వీరేంద్ర దీక్షిత్ ఒళ్లు హునం అయ్యేలా బడితె పూజ చేయాలనిపించక మానదు.
తనను తాను శ్రీకృష్ణుడి అవతారంగా చెబుతూ.. 2020లో ప్రపంచం అంతమై పోతుందని.. ఆ తర్వాత తామంతా కలిసి ప్రపంచాన్ని మళ్లీ క్రియేట్ చేస్తామని.. ఆ గురుతర బాధ్యత కోసమే తాము పుట్టినట్లుగా నమ్మించటంలో అతగాడు మొనగాడు. అతడి మాటల్ని నమ్మినోళ్లలో సామాన్యులే కాదు.. అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ పూర్తి చేస్తూ.. చక్కటి ఉద్యోగం చేస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సంతోషి అనే అమ్మాయి కూడా ఈ ముసలోడి మాటల్ని మస్తుగా నమ్మేసింది. బ్యాంక్ అకౌంట్లో కోటి ఉన్న ఆమె.. ఇప్పుడు ఆశ్రమంలో బందీగా ఉండటమే కాదు.. వేదనతో వారి తల్లిదండ్రులు వెళితే.. త్వరలో ప్రపంచం అంతమవుతుంది. మేం చాలా పెద్ద పనిలో ఉన్నామంటూ.. మళ్లీ కలవొద్దని చెప్పేస్తూ షాకిస్తుంది.
వీరేంద్ర మాట ప్రభావానికి లోనైన ఎంతోమంది అమ్మాయిలు వారి జీవితాన్ని బుగ్గి చేసుకున్నారు. పదహారు వేల మంది అమ్మాయిల్ని చెరబట్టటమే అతగాడి లక్ష్యమని చెబుతుంటారు. తన దగ్గరకు వచ్చే మూఢ భక్తులకు తన మాయలో పడేసుకొని.. వారిని బానిసలుగా చూస్తుంటాడు. ఒక్కసారి అతగాడి ఆశ్రమంలోకి అడుగు పెడితే తిరిగి బయటకు రావటం కష్టమని చెబుతారు. దేశ వ్యాప్తంగా అనేక కేంద్రాలు ఉన్న అతగాడికి ఢిల్లీలోనే ఐదు కేంద్రాలు ఉన్నట్లు చెబుతారు.
తాను ఏ ఆశ్రమానికి వెళితే.. ఆశ్రమంలో ఆ రాత్రి అతడికి గుప్త ప్రసాదం పేరుతో ఎనిమిది నుంచి పది మంది అమ్మాయిల్ని ఏర్పాటు చేయాలని.. ఆ రాత్రి అతడితో గడిపిన అమ్మాయిల్ని తర్వాతి రోజు నుంచి రాణులు గా పిలుస్తారని చెబుతారు. 2017లో ఒక యువతి తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించటంతో తొలిసారి ఇతగాడి దుర్మార్గాలు బయటకు వచ్చాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు.. లాయర్లు.. పోలీసుల బృందం ఒకటి ఆశ్రమం దాడి చేస్తే.. 67 మంది బాలికల్ని గుర్తించారు. వారంతా ఆశ్రమంలో బందీలుగా ఉన్నట్లుగా తేలింది.
తర్వాత ఈ కేసు సిబీఐకి వెళ్లింది.2018 జనవరి లో అతగాడి లీలలపై సీబీఐ మూడు ఎఫ్ఐఆర్ లను నమోదు చేసింది. అప్పటికే పరారైన అతగాడి మీద రెండుసార్లు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రెండేళ్లుగా వీరేంద్ర పరారీలో ఉన్నా.. అతగాడి ఆశ్రమం నడుస్తుండటం విశేషం. గతంలో (1998లో) వీరేంద్ర అరెస్టు అయి ఆర్నెల్లు జైల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పరారీలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆచూకీ చెప్పిన వారికి రూ.5లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఇతగాడి మాటలకు ప్రభావితమైన నిజామాబాద్ నానో శాస్త్రవేత్త ఇప్పటికి ఆశ్రమంలోనే ఉండటం గమనార్హం. తాను ఇష్టంతోనే ఉన్నానని.. తనను బలవంతం పెట్టొదని చెప్పే ఆమె మాటలకు ఆమె తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. వీరేంద్ర ప్రభావంతోనే తమ కుమార్తె ఇలా మాట్లాడుతుందని.. అతగాడి మాయ నుంచి బయటపడేయాలని వారు వేడుకోవటం చూస్తే.. అయ్యో అనిపించకుండా ఉండదు.