Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. వన్డే కెరీర్ లో తొలిసారి ఇదీ..

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:57 AM GMT
విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. వన్డే కెరీర్ లో తొలిసారి ఇదీ..
X
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా అంచనాల మేరకు రాణించలేక చతికిలపడింది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా తాజాగా మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండో వన్డే ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. రెండో వన్డేలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0 ) తీవ్రంగా నిరాశపరిచాడు. తొందరపాటు బ్యాటింగ్ తో ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా పరుగు వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహల్ (24 ) , శిఖర్ ధావన్ (29 ) మంచి ఆరంభాలను ఇచ్చారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే టీమిండియా కథ మారింది.

స్పిన్నర్లు భారత్ ను కట్టిపడేశారు. భారత బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి తడబడ్డారు. దీంతో రన్ రేట్ తగ్గింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఐదు బంతుల్లోనే ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో తడబడ్డ విరాట్.. అతడు వేసిన ఆఫ్ స్టంప్ బాల్ ను కవర్ డ్రైవ్ చేయబోయి క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ డకౌట్ అయ్యి వెనుదిరిగాడు.

కోహ్లీ ఇలా డకౌట్ అయ్యి ఓ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. తన వన్డే కెరీర్ లో ఓ స్పిన్నర్ బౌలింగ్ లో ఇలా డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో 64 పరుగులకే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరుఫున వన్డే క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ , కపిల్ దేవ్ లు 3 సార్లు డకౌట్ కాగా.. కోహ్లీ వారిని దాటేసి 14 డకౌట్లతో రైనా , సెహ్వాగ్ , జహీర్ లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు.

వీరికంటే ముందు సచిన్ (20 డకౌట్ లు ) , జవగల్ శ్రీనాథ్ (19 డకౌట్ లు ) , అనిల్ కుంబ్లే , యువరాజ్ లు (18 డకౌట్ లు )తో ఉన్నారు.