Begin typing your search above and press return to search.
జిమ్ లేకున్నా బాల్కనీలోనే కోహ్లీ వర్కౌట్లు
By: Tupaki Desk | 27 Aug 2020 8:50 AM GMTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు మారు పేరు. నిత్యం వర్కౌట్లు చేసే కోహ్లీ ఎంతో దృఢంగా ఉంటాడు. భారత క్రికెట్ లో ధోని హయాంకు ముందు వరకు ఆటగాళ్లు ఫిట్నెస్ కు మరీ అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ధోని వచ్చాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అతడు ఎప్పుడూ ఫిట్ గా ఉండేవాడు. ఇక కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత జట్టులో ఫిట్నెస్ పరంగా జట్టులో సమూల మార్పులు తీసుకు వచ్చాడు. ఎంత కీలక ఆటగాడైనా సరే ఫిజికల్ గా హెల్తీగా ఉంటూ యోయో టెస్ట్లో పాస్ అయ్యేలా చూస్తున్నాడు. దీంతో ఆటగాళ్లందరూ ఫిట్నెస్ పరంగా ఎంతో మెరుగయ్యారు.
రోజూ గంటల తరబడి జిమ్ లో గడిపే విరాట్ కోహ్లీ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తుంటాడు. అతడు ఇచ్చిన స్ఫూర్తితో ఆల్ రౌండర్లు జడేజా, హార్దిక్ పాండ్యా, బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, బౌలర్లు బుమ్రా, షమీ సిక్స్ ప్యాక్ చేశారు. శారీరకంగా దృఢంగా ఉంటేనే క్రిజ్లో వేగంగా కదలడం, పరుగులు తీయడం, గంటల తరబడి బ్యాటింగ్ చేయడం సులభమని విరాట్ కోహ్లీ నమ్ముతాడు. అందుకే ఎప్పుడూ అతడు వ్యాయామం చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంటాడు. దీనికోసం అతడు పూర్తి శాకాహారిగా కూడా మారాడు. వచ్చే నెల 19వ తేదీ నుండి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జట్లు దుబాయ్ కి చేరుకొని నిబంధనల ప్రకారం హోటల్ క్వారంటైన్లో ఉన్నాయి. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు కూడా ప్రస్తుతం ఓ హోటల్ లో ఉన్నారు.
అయితే అక్కడ విరాట్ కోహ్లీకి జిమ్ సౌకర్యం లేక పోయింది. అయినా సరే కోహ్లీ విశ్రాంతి తీసుకోలేదు. తను రోజూ చేసే ఎక్సర్సైజులు చేశాడు. పుష్ అప్స్, డంబెల్స్ సాయంతో చెమట చిందించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విట్టర్ లో కోహ్లీ బాల్కనీలో జిమ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. 'కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్కనీ జిమ్ కి స్వాగతం 'అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిమ్ అందుబాటులో లేకున్నా కోహ్లీ వర్కౌట్లు చేస్తూ చెమటలు చిందించడం చూసి అభిమానులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.