Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : కుమార్తెతో సేదతీరుతున్న విరాట్ కోహ్లీ
By: Tupaki Desk | 11 April 2023 5:17 PM GMTఐపీఎల్ లో ఆడుతూ విరాట్ కోహ్లీ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్ లో తన కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతున్నాడు. కరోనా నిబంధనలు పూర్తిగా పోవడంతో ఇప్పుడు ఫ్యామిలీతో పర్యటిస్తూ టీమిండియా దిగ్గజ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడుపుతున్నాడు. తన భార్య, కూతురుతో కలిసి మ్యాచ్ లు జరిగే నగరాల్లోని హోటల్స్, రిసార్ట్ లలో సేదతీరుతున్నాడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో కూతురు వామికతో ఈతకొలనులో ముచ్చట పెడుతూ విరాట్ సేదతీరుతున్న ఫొటో వైరల్ గా మారింది.
ఈ ఇన్‌స్టాగ్రామ్ ఫొటో అందరినీ ఆకట్టుకుంది. విరాట్ కుమార్తె ముఖం కనిపించకుండా వెనుక నుంచి తీశారు. క్యూట్‌నెస్‌తో నిండి ఉంది. కుమార్తె వామిక(2)తో క్రికెటర్ కొత్త పోస్ట్‌ను క్రికెట్ ప్రేమికులు తెగ షేర్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో ఒక సూపర్ క్యూట్ చిత్రాన్ని విరాట్ పోస్ట్ చేశాడు.
ఇందులో ముఖ్యంగా తండ్రీ-కూతురు ద్వయం కలిసి ఈత కొలనులో కలిసి ఉన్న ఫొటో అద్భుతంగా ఉంది. తెగ వైరల్ అవుతోంది. చాలా మంది హార్ట్ సింబల్ తో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి క్యాప్షన్ అవసరం లేదని అంటున్నారు.
అనుష్క శర్మతో చాలా ఏళ్ల పాటు డేటింగ్ తర్వాత 2017లో ఇటలీలో జరిగిన ఒక సన్నిహిత వేడుకలో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆమెను వివాహం చేసుకున్నారు. వారికి జనవరి 2021లో కుమార్తె వామిక జన్మించింది.
వామికా తన తల్లిదండ్రుల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లలో కనిపించినప్పుడు ఎప్పుడూ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. విరాట్ షేర్ చేసిన ఈ చిత్రంలో వామికను వెనుక నుంచే చూపించారు. ఈ ఫొటో షేర్ చేసి క్యాప్షన్ ఇచ్చాడు. "అన్ని సందేహాల వంతెనలను దాటుతూ.. ప్రేమలోకి వచ్చాం" అంటూ విరాట్ ఎమోషనల్ అయ్యాడు.
ఈ సంవత్సరం వామికా పుట్టినరోజున విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యారు. "నా హృదయ స్పందన 2." అంటూ రాసుకొచ్చాడు. అనుష్క శర్మ కూడా అదే ఫొటో షేర్ చేస్తూ "రెండు సంవత్సరాల క్రితం నా హృదయం మరింత విశాలంగా తెరిచింది." అంటూ కూతురు రాకతో తాము ఎంత సంతోషంగా ఉన్నామో విరాట్-అనుష్క చెప్పుకొచ్చారు.