Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ కెప్టెన్ దెబ్బకు కొట్టుకుపోయిన విరాట్ కోహ్లీ

By:  Tupaki Desk   |   16 Jun 2022 2:30 AM GMT
పాకిస్తాన్ కెప్టెన్ దెబ్బకు కొట్టుకుపోయిన విరాట్ కోహ్లీ
X
ప్రపంచ క్రికెట్ ను కొన్ని సంవత్సరాల పాటు శాసించిన విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. అతడి ఆట గాడితప్పింది. వన్డేలు, టెస్టులు, టీ20ల్లోనూ రాణించడం లేదు. సెంచరీలు చేయక రెండుమూడేళ్లు అవుతోంది. అది అతడి ర్యాంకింగ్స్ పై కూడా పడింది. ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మెన్ గా ఉన్న కోహ్లీ ఇప్పుడు దిగజారిపోయాడు. ర్యాంకింగ్స్ లో నంబర్ 1 ర్యాంకును కోల్పోయాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హనీమూన్ పీరియడ్ ముగిసి కెప్టెన్సీ కూడా కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు ఐదారేళ్లు టీమిండియా క్రికెట్ లో వెలుగు వెలిగిన విరాట్ ఇప్పుడు ఫాం కోల్పోయి.. కెప్టెన్సీలో కప్ లు గెలవలేక వైదొలగాల్సి వచ్చింది.

ప్రస్తుతం విరాట్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరికీ విరాట్ కోహ్లీ టార్గెట్ అయిపోయాడు. విరాట్ సాధించిన గొప్ప విజయాలను మరుగునపడేలా కొందరు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్ లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ దెబ్బ పడింది. చాలా కాలంగా పేలవ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానానికి చేరడం గమనార్హం. ఇక వన్డేల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఇక టీ20లోనూ బ్యాటింగ్ లో బాబర్ అజం మొదటి స్థానంలో ఉండడం విశేషం.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో జోష్ హేజిల్ వుడ్ నంబర్ 1 బౌలర్ గా నిలిచాడు. ఈ బౌలర్ 792 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో హేజిల్ వుడ్ నంబర్ 2, ట్రెంట్ బౌల్డ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన తర్వాత రూట్ నంబర్ 1 ర్యాంకుకు చేరాడు. అంతకుముందున్న ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ మార్నస్ లాబుస్ చెన్ ను అధిగమించాడు.

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం.. ఆ తర్వాత అతడిని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు సెలక్టర్లు నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి.టెస్టుల్లో అయనా కెప్టెన్ గా కొనసాగుతాడులే అనుకుంటున్న సమయంలో కేప్ టౌన్ టెస్టు ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకొని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ.