Begin typing your search above and press return to search.

కోహ్లీ పెళ్లి..బీజేపీ ఎమ్మెల్యే దేశ‌భ‌క్తి ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   20 Dec 2017 4:40 AM GMT
కోహ్లీ పెళ్లి..బీజేపీ ఎమ్మెల్యే దేశ‌భ‌క్తి ప్ర‌శ్న‌
X
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. కోహ్లీ వివాహంపై బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు వివాదం రాజేశారు. తమపెళ్లి మిలన్ (ఇటలీ)లోని ఒక ప్రైవేటు రిసార్ట్‌ లో జరిగిందని కోహ్లీ - అనుష్క ట్విటర్ ద్వారా సమాచారమిచ్చారు. పెళ్లి ఫొటోలను కూడా వారు సోషల్ మీడియాలో ఉంచారు. వీరి వివాహం ఎంత గుట్టుచప్పుడు కాకుండా జరిగిందో - పెళ్లి ఫొటోలు అంతగా వైర‌ల్ అయ్యాయి. అయితే ఇటలీలో పెళ్లి చేసుకోవడమేనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశభక్తి ..అంటూ ఓ శాస‌న‌స‌భ్యుడు ప్ర‌శ్నించారు. ఈ విధంగా అనూహ్య‌మైన ప్ర‌శ్న వేసింది బీజేపీ ఎమ్మెల్యే ఫన్నాలాల్ ప్రశ్నించారు.

స్వదేశంలో కాదని ఇటలీలో ఎందుకు పెళ్లి చేసుకున్నారని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీపై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ కు చెందిన‌ బీజేపీ ఎమ్మెల్యే ఫన్నాలాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో డబ్బులు సంపాదించి విదేశాల్లో ఖర్చు పెడతారా అని ఆయన విమర్శించారు. ఇలాంటి తీరు మార్చుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. కాగా, ఇట‌లీలో జ‌రిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది స్నేహితులు - సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం. ఇలావుంటే, ఈనెల 21న న్యూఢిల్లీలో - 26న ముంబయిలో రిసెప్షన్ ఇవ్వడానికి వీరు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదిలాఉండ‌గా...కోహ్లీ - స్టాండిన్ కెప్టెన్ రోహిత్‌ శర్మ మధ్య ట్విట్టర్‌ లో ఓ ఫన్నీ చాట్ జరిగింది. ఆ మధ్య కోహ్లీ పెళ్లవగానే అతనికి రోహిత్ ఓ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. `కోహ్లీ.. భర్త ఎలా ఉండాలో చెప్పే ఓ హ్యాండ్‌ బుక్ ఇస్తా.. అనుష్కశర్మ.. నువ్వు నీ ఇంటి పేరు మార్చుకోకు` అని ఇద్దరికీ కలిపి ఒకే ట్వీట్‌ లో రోహిత్ సలహాలు ఇచ్చాడు. ఆ ట్వీట్ చేసి వారం రోజులు అవుతుంది. మొత్తానికి దానికి రిైప్లె ఇవ్వడానికి కోహ్లీకి ఇప్పుడు సమయం దొరికింది. అతనిచ్చిన సలహాలు తీసుకున్న కోహ్లీ.. రోహిత్‌ ను మరో సలహా అడిగాడు. ఆ బుక్‌ తోపాటు డబుల్ సెంచరీలు ఎలా చేయాలో అది కూడా ఇవ్వు అని విరాట్ ట్వీట్ చేశాడు. కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసే ముందే రోహిత్ వన్డేల్లో తన మూడో డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.