Begin typing your search above and press return to search.

కోహ్లీ... మోదీకి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చావే!

By:  Tupaki Desk   |   26 Jun 2017 4:41 AM GMT
కోహ్లీ... మోదీకి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చావే!
X
గుజ‌రాత్‌ ముఖ్య‌మంత్రిగా ఉంటూనే గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాన మంత్రి అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన న‌రేంద్ర మోదీ... ఆ ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియాను గ‌తంలో ఏ ఒక్క‌రూ వాడ‌ని రీతిలో వాడేసి ఘ‌న విజ‌యం సాధించారు. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి అధిష్టించిన త‌ర్వాత కూడా మోదీ... సోష‌ల్ మీడియాను ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని, ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్ర‌తి కొత్త విష‌యాన్ని కూడా ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... సోష‌ల్ మీడియాలో అత్య‌ధిక మంది ఫాలోయ‌ర్లున్న నేత‌గా రికార్డుల‌కెక్కారు. ఒకానొక ద‌శ‌లో అమెరికా అధ్య‌క్షుడికి ఉన్నంత రేంజిలో సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ సంపాదించిన మోదీ... ప్ర‌స్తుతం భార‌త దేశానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో అత్య‌ధిక మంది ఫాలోయ‌ర్లున్న వ్య‌క్తి.

ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోష‌ల్ మీడియా ఫాలోయింగ్‌ లో శ‌ర‌వేగంగా దూసుకువ‌స్తున్నాడు. టీమిండియాలో డ్యాషింగ్ బ్యాట్స్ మ‌న్‌ గా ఖ్యాతిగాంచిన కోహ్లీ... కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను ఇక మోయ‌లేనంటూ దిగిపోయిన త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు ప‌గ్గాలు అందుకున్నాడు. ఇలా ప‌గ్గాలు చేతికి చిక్కాయో... కోహ్లీ కూడా త‌న‌దైన రేంజిలో విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చాడు. అయితే మొన్నటి ఛాంపియ‌న్స్ ట్రోఫీలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత అత‌డి ప్ర‌భ కాస్తంత త‌గ్గిన‌ట్టు క‌నిపించినా... త‌న‌లోని ఆట‌గాడు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని అత‌డు నిరూపిస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డిని సోష‌ల్ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

ప్ర‌స్తుత గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో మోదీ త‌ర్వాత అత్య‌ధిక మంది ఫాలోయ‌ర్లున్న వ్య‌క్తిగా కోహ్లీ రికార్డుల‌కెక్కాడు. ప్ర‌స్తుతం కోహ్లీ ఫేస్‌ బుక్ ను 3.57 కోట్ల మంది ఫాలో అవుతున్నార‌ట‌. ఇక ఈ విష‌యంలో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న మోదీకి ఫేస్ బుక్‌ లో 4.22 కోట్ల మంది ఫాలోయ‌ర్లున్నారు. ఫేస్ బుక్ ఫాలోయింగ్ లో రెండో స్థానానికి ఎగ‌బాకిన కోహ్లీ... బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌ ను దాటేశాడు. కోహ్లీ జోరు ఇలాగే కొన‌సాగితే... స‌మీప భ‌విష్య‌త్తులోనే అత‌డు సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ లో ప్ర‌థ‌మ స్థానానికి ఎగ‌బాకినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/