Begin typing your search above and press return to search.

కొహ్లీకి ఇది పీడ‌క‌లే: సీరిస్ లో షమీ క‌న్నా త‌క్కువ స్కోరు!

By:  Tupaki Desk   |   2 March 2020 2:06 PM GMT
కొహ్లీకి ఇది పీడ‌క‌లే: సీరిస్ లో షమీ క‌న్నా త‌క్కువ స్కోరు!
X
నిన్న మొన్న‌టి వ‌ర‌కూ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ బ్యాట్స్ మ‌న్ గా దిగ్గ‌జాల స‌ర‌స‌న ఆట‌గాడిగా స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు పొందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ అనూహ్య‌మైన విమ‌ర్శ‌ల్లో చిక్కుకుంటూ ఉన్నాడు. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో కొహ్లీ బ్యాట్స్ మ‌న్ గా పూర్తి విఫ‌లం అయ్యాడు. టీ20లు, వ‌న్డేలు, టెస్టులు తేడా లేకుండా కొహ్లీ స‌రిగా ఆడ‌లేదు. అయితే టీ20ల్లో కొహ్లీ స‌రిగా ఆడ‌క‌ పోయినా.. జ‌ట్టు నెగ్గింది. రోహిత్ శ‌ర్మ త‌న ఇన్నింగ్స్ ల‌తో మ్యాచ్ ల‌ను గెలిపించాడు. 5-0తో టీ20 సీరిస్ సొంతం అయ్యింది. దీంతో కొహ్లీపై ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌లేదు.

అదే వ‌న్డేల విష‌యానికి వ‌స్తే తేడా వ‌చ్చింది. అప్ప‌టికే రోహిత్ శ‌ర్మ జ‌ట్టుకు దూరం అయ్యాడు. కొహ్లీ ఫామ్ లేమి కొన‌సాగింది. ఫ‌లితంగా కివీస్ జ‌ట్టు వ‌న్డే సీరిస్ ను సొంతం చేసుకుంది. 3-0తో ఇండియాను చిత్తు చేసింది కివీ జ‌ట్టు. ఇక టెస్టుల విష‌యానికి వ‌స్తే.. మ‌నోళ్ల ప్ర‌ద‌ర్శ‌న మ‌రింత దిగ‌జారింది. 2-0తో భార‌త జ‌ట్టు టెస్టు సీరిస్ లో వైట్ వాష్ అయ్యింది. అయితే క‌నీసం మ్యాచ్ ను మూడు రోజుల్లోపే ముగించేసి టీమిండియా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

ఈ మ్యాచ్ ల‌లో కొహ్లీ ప్ర‌ద‌ర్శ‌న మ‌రింత దారుణం గా ఉండ‌టం గ‌మ‌నార్హం. రెండు టెస్టుల ఈ సీరిస్ లో కొహ్లీ చేసిన మొత్తం ప‌రుగులు 38. నాలుగు ఇన్నింగ్స్ ల‌లో బ్యాటింగ్ కు వ‌చ్చి కొహ్లీ కేవ‌లం 38 ప‌రుగులు చేయ‌గ‌లిగాడు. యావ‌రేజ్ 9.50గా న‌మోదు అయ్యింది. కొహ్లీ వంటి అట‌గాడికి ఇది పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

మ‌రింత పేల‌వం ఏమిటంటే.. కొహ్లీ క‌న్నా బౌల‌ర్లే ఈ సీరిస్ లో ఎక్కువ ప‌రుగులు చేశారు. భార‌త ఫాస్ట్ బౌల‌ర్ ష‌మీ, న్యూజిలాంట్ ఫాస్ట్ బౌల‌ర్ బోల్ట్ లు కొహ్లీ క‌న్నా ఎక్కువ ప‌రుగులు చేసిన బ్యాట్స్ మ‌న్ ల జాబితా లో ఉన్నారు. వారిద్ద‌రూ 39 ప‌రుగుల చొప్పున చేశారు. ఇలా ఫామ్ లేమితో.. కొహ్లీ బౌల‌ర్ల క‌న్నా త‌క్కువ ప‌రుగులు చేసిన స్టార్ బ్యాట్స్ మ‌న్ గా నిలుస్తున్నాడు.