Begin typing your search above and press return to search.
కోహ్లీ ఇంకా కుర్రతనమేలా?
By: Tupaki Desk | 24 Jan 2020 3:34 PM GMTటీం ఇండియా నేటి నుండి న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఆరంభించింది. న్యూజిలాండ్ గడ్డపై మొదటి టీ20ని టీం ఇండియా గెలిచింది. టాప్ ఆర్డర్ విఫలం అయినా కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్స్ ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ విజృంభించడంతో టీం ఇండియా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ లో కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే కోహ్లీ హావభావాలు.
శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్న సమయంలో కోహ్లీ ఒక సాదారణ ప్రేక్షకుడిగా ప్రతి షాట్ ను ఎంజాయ్ చేశాడు. అయ్యర్ ఫోర్లు సిక్స్ లు కొట్టిన సమయంలో కోహ్లీ చాలా ఉద్వేగానికి లోనైనట్లుగా కనిపించాడు. మ్యాచ్ చివరికి వచ్చేప్పటికి కోహ్లీ నిల్చుని మరీ ప్రేక్షకుల మాదిరిగా విన్నింగ్ షాట్ ను ఎంజాయ్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ గాల్లోకి పిడికిలితో పంచ్ లు ఇస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఒక సిరీస్ గెలిచినంత సంతోషం కోహ్లీలో కనిపించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ సూపర్ విక్టరీ అంటూ కామెంట్స్ చేశాడు.
న్యూజిలాండ్ ను కోహ్లీ చాలా బలమైన జట్టుగా భావించాడని.. అలాంటి జట్టుపై విజయం సాధించడంతో కోహ్లీ ఇలా ప్రవర్తించాడంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కోహ్లీలో ఇంకా కుర్రతనం పోయినట్లు లేదని.. టీం ఇండియా కెప్టెన్ అయినందున హుందాగా ప్రవర్తించాలంటూ కొందరు సలహా ఇస్తున్నారు. మొత్తానికి వరుసగా విజయాలతో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు దక్కించుకున్న కోహ్లీ ఈ సిరీస్ ను కూడా సక్సెస్ తోనే మొదలు పెట్టడంతో ఆయన అభిమానుల్లో ఆనందం కనిపిస్తుంది.