Begin typing your search above and press return to search.
ప్లీజ్.. నన్ను నమ్ముకోవద్దంటున్న కోహ్లీ!
By: Tupaki Desk | 16 Jun 2019 6:02 AM GMTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ప్రపంచ క్రికెట్ అభిమానులు.. మరి ముఖ్యంగా ఉప ఖండంలోని క్రీడాభిమానులంతా ఈ రోజు జరగనున్న భారత్ - పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం పూట మ్యాచ్ రావటం.. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్న వైనం తెలిసిందే.
సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్న ఈ మ్యాచ్ కు ఇప్పుడు వర్షం గండం పొంచి ఉంది. ఇదిలా ఉంటే..ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను అడుగుతున్న స్నేహితులు.. బంధువులతో తెగ ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాజాగా టికెట్ల కోసం తనను అడుగుతున్న వారికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు.
భారత్ - పాక్ మ్యాచ్ కోసం టికెట్లు అడుగుతున్న స్నేహితులు.. బంధువులు తనను నమ్ముకోవద్దని.. అవకాశం ఉంటే ఇంగ్లండ్ వచ్చి మ్యాచ్ చూడాలని.. లేదంటే ఇంట్లో కూర్చొని టీవీలో ఆటను చూడాలని సూచన చేశారు. అందరి ఇళ్లల్లో టీవీ ఉంటాయని.. ఒకసారి ఇవ్వటం మొదలు పెడితే ఇక అంతం అంటూ ఉండవన్నారు. ఈ మ్యాచ్ మీద అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కోహ్లీ కాస్త ప్రాక్టికల్ గా మాట్లాడారని చెప్పాలి.
తన మాటలతో అనవసర భావోద్వేగాలు పెంచకుండా ఆయన సెటిల్డ్ గా మాట్లాడటం కనిపిస్తుంది. ఈ మ్యాచ్ అన్ని మ్యాచ్ ల మాదిరే నిర్ణీత సమయానికి మొదలై.. గడుపు సమయానికి పూర్తి అవుతుందని.. బాగా ఆడినా.. ఆడకున్నా ఇదేమీ జీవితకాలం సాగదని తేల్చేశారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఇదే ముగింపు కాదని.. టోర్నమెంట్ ఇంకా మిగిలే ఉందని చెప్పారు.
తన మాటలతో జట్టులో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావటంతోపాటు.. అనవసరమైన ఒత్తిడిని తగ్గించే ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ ఒక్కరి మీదా భారం ఉండదని.. అందరూ కలిసి భారాన్ని పంచుకుంటారన్నారు. వాతావరణం మన చేతుల్లో లేదు కాబట్టి అన్నింటికి సిద్ధంగా ఉండాలన్నారు.
టీవీ రేటింగ్స్ కు పనికి వచ్చే కామెంట్లు తాను చేయనని.. తనకు ఏ బౌలరైనా ఒకేరని.. తాను బౌలర్ కన్నా బంతిని మాత్రమే చూస్తానని చెప్పారు. ఈ మ్యాచ్ ను మరీ పర్సనల్ గా తీసుకోవద్దన్నట్లుగా కోహ్లీ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. అభిమానులకు ఒక సందేశాన్ని ఇస్తూ.. మ్యాచ్ ను చూడండి.. చూసి ఆనందించండి.. ఇది కేవలం క్రికెట్ మాత్రమేనని స్పష్టం చేశారు. గత ట్రాక్ రికార్డును చూస్తే.. విశ్వవేదికపై ఇప్పటివరకూ దాయాదితో జరిగిన అన్ని పోరుల్లోనూ భారతే పైచేయి సాధించటం గమనార్హం.