Begin typing your search above and press return to search.
విరాట్ కొహ్లీ.. బోణీ కొట్టేదెప్పుడో స్టారూ!
By: Tupaki Desk | 8 April 2019 1:30 AM GMTబహుశా.. అంతమంది స్టార్ క్రికెటర్లు ఉన్న ఒక జట్టు విజయం కోసం మరీ ఇంతలా ప్రయత్నాలు చేయాల్సి రావడం విచిత్రం! ఒకటా రెండా..ఏకంగా ఆరు మ్యాచులు పూర్తి అయినా ఆర్సీబీ ఇంత వరకూ విజయాల ఖాతాను తెరవలేదు. ఈ ఏడాది ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పీడకలగా మారుతున్నట్టుగా ఉంది! టీమిండియా సారధి విరాట్ కొహ్లీ నాయకత్వంలోని ఈ టీమ్ ఈ సారి వరసగా ఆరో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది. తద్వారా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఇలా వరసగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోవడం ద్వారా బెంగళూరు జట్టు పరాజయాల విషయంలో కొత్త రికార్డును సృష్టించినట్టే. ఇది వరకూ ఢిల్లీ జట్టు ఒకే సీజన్లో వరసగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఆ రికార్డును విరాట్ కొహ్లీ ఆధ్వర్యంలోని బెంగళూరు జట్టు సమం చేసింది.
దాదాపు సగం మ్యాచ్ లను ఆడేస్తున్న తరుణంలో ఇంత వరకూ బెంగళూరు జట్టు ఒక్క విజయాన్ని కూడా సాధించకపోవడంతో ఈ సారి ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. బెంగళూరు జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ప్రత్యేకించి బ్యాటింగ్ విషయంలో ఈ జట్టులో ఉద్ధండ పిండాలున్నారు. అయితే వారంతా కలిసి కట్టుగా రాణించలేకపోతున్నారు.
ఒకవేళ బ్యాట్స్ మన్ రాణించినా… అదే మ్యాచ్ లో బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. దీంతో విజయం సాధించలేకపోతోంది ఈ టీమ్. ఇది ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తూ ఉంది. చివరకు కొహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితిని ఎంత వరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు!