Begin typing your search above and press return to search.

మరో వివాదంలో విరాట్ కోహ్లీ..

By:  Tupaki Desk   |   6 Jan 2021 4:09 PM GMT
మరో వివాదంలో విరాట్ కోహ్లీ..
X
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. ఓ లీగ్ లో రహస్యంగా పెట్టుబడులు పెట్టిన వైనం వెలుగుచూసి ఇరకాటంలోపడ్డారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఆటగాళ్లు, సిబ్బంది, మాజీలు.. పెన్షనర్స్ అంతా కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందితే అనర్హత వేటు వేస్తారు.

ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో పెట్టుబడి పెట్టిన విషయం బయటపడింది. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కోహ్లీకి అందులో 0.051శాతం వాటా ఉన్న విషయం వెలుగుచూసింది.

దీంతో కోహ్లీ బీసీసీఐ రూల్స్ ను తుంగలో తొక్కినట్టైంది. అతడిపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల పేరిట ఆరోపణలు వస్తున్నాయి.

కోహ్లీ పెట్టుబడులు పెట్టిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నే గత ఏడాది అధికారిక కిట్ స్పాన్సర్ గా బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. అసీస్ టూర్ లో కోహ్లీ అదే లోగో ఉన్న జెర్సీతో ఆడటం వివాదాస్పదమైంది.