Begin typing your search above and press return to search.
నా తిక్కేంటో చూపిస్తా ..అందరి లెక్కలూ తేలుస్తా : విరాట్ కోహ్లీ !
By: Tupaki Desk | 4 March 2020 8:45 AM GMTవిరాట్ కోహ్లీ ..ప్రపంచానికి పరిచయం అవసరంలేని పేరు. ప్రస్తుతం క్రికెట్ లో ఎవరి శకం నడుస్తుంది అని ఎవరిని అడిగినా అందరూ చెప్పే ఒకే ఒక పేరు విరాట్ కోహ్లీ. ఇండియన్ టీం స్టార్ ప్లేయర్ గా , అలాగే టీం ఇండియా కెప్టెన్ గా తన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ జట్టుని అగ్రపథంలో తీసుకుపోతున్నాడు. ఇక ఎంతటి ఆటగాడికైనా కూడా కొన్ని సమయాలలో అదృష్టం కలిసి రాదు. అన్ని సమయాలలో బ్యాట్ తో దంచి కొట్టాలంటే సాధ్యపడదు. ప్రస్తుతం కింగ్ కోహ్లీ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు.
తాజాగా ఇండియా . సుదీర్ఘమైన కివీస్ పర్యటనని ముగించుకున్న విషయం తెలిసింది. కివీస్ పర్యటనకి వెళ్లిన భారత్ , అక్కడ 5 t20 , మూడు వన్డే , రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. మొదట t20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి , సూపర్ ఫామ్ లో ఉన్న ఇండియన్ టీం కి షాక్ ఇస్తూ కివీస్ టీం వన్డే , టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ చేసారు. దీనికి ప్రధాన కారణం బ్యాటమెన్స్ ఘోరంగా విఫలం కావడమే. అలాగే ప్రధాన బ్యాటమెన్స్ లో కొందరు గాయాలతో టీం లో లేకపోవడం , జట్టులో ఉన్నవారు ఫామ్ లో లేకపోవడంతో కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థితిలో ఇండియా , కివీస్ కి దాసోహం అయ్యింది. ఏది ఏమైనా టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన వరుసగా రెండు పరాజయాలను చవి చూడడం అభిమానులకే కాదు , సీనియర్ ఆటగాళ్లకు కూడా అంతగా రుచించలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే ..
అయితే , రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భం గా .. జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం స్లిప్స్‌లో క్యాచ్ అందుకున్న కోహ్లీ.. న్యూజిలాండ్ ప్లేయర్లను ఉద్దేశించి ‘కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు లెక్కలు సరి చేస్తామని’ ఘాటుగా ఘాటుగా జవాబిచ్చినట్లు తెలుస్తోంది. ‘జబ్ ఇండియా మే యే లోగ్ అయేంగే తబ్ ధికా దుంగా’ అంటూ కోపం అన్నాడట. అలాగే , విలియమ్సన్ ఔటైనప్పుడు సెండాఫ్ ఇచ్చే క్రమంలో కోహ్లీ అతిగా ప్రవర్తించాడు. నోరు మూసుకోవాలనే అర్థం వచ్చేలా సైగలు చేస్తూ.. బూతుపురాణం అందుకున్నాడు. ఆ వెంటనే ప్రేక్షకులను కూడా తిట్టాడు. ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ మీడియా సమావేశం లో ప్రస్తావించగా ఆ జర్నలిస్ట్ పై కోహ్లీ ఫైర్ అయ్యాడు. సగం సగం తెలుసుకొని ప్రశ్నలు అడగవద్దని, పూర్తి సమాచారంతో రావాలని సూచించాడు. మ్యాచ్ ముగిసినా.. భారత్ 0-2తో చిత్తుగా ఓడినా.. ఇవేవి పట్టించుకోని ఫ్యాన్స్ కోహ్లీ వ్యవహారి శైలినే తప్పబడుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.