Begin typing your search above and press return to search.

అక్కడ ఏంజరిగిందో తెలుసుకో? జర్నలిస్ట్‌ పై రెచ్చిపోయిన కోహ్లీ!

By:  Tupaki Desk   |   2 March 2020 9:30 PM GMT
అక్కడ ఏంజరిగిందో తెలుసుకో? జర్నలిస్ట్‌ పై రెచ్చిపోయిన కోహ్లీ!
X
విరాట్ కోహ్లీ ...ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి బ్యాట్స్ మెన్ లో కోహ్లీ అగ్ర స్థానంలో ఉన్నాడు. గ్రౌండ్ ఏదైనా , దేశం ఏదైనా , బౌలర్ ఎవరైనా ..రన్స్ కొట్టడమే కోహ్లీ కి తెలిసిన ఏకైక నైజం. ఒక్కసారి కోహ్లీ బ్యాట్ జుళిపిస్తే ..క్రికెట్ లో కొత్త రికార్డ్స్ పుట్టుకు రావాల్సిందే. ప్రస్తుతం ఇండియన్ టీం కెప్టెన్ గా , కీలక ప్లేయర్ గా డ్యూయల్ రోల్ పోషిస్తూ ..టీం లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇకపోతే టీం ఇండియా తాజాగా న్యూజిలాండ్ కి సుదీర్ఘమైన పర్యటనకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా ఐదు t20 లు ... మూడు వన్డేలు , రెండు టెస్ట్ లు ఆడారు. మొదట్లో జరిగిన T 20 సిరీస్ లో రెచ్చిపోయిన భారత్ బ్యాటమెన్స్ ఆ తరువాత అదే రేంజ్ లో ఆకట్టుకో లేకపోయారు. t20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ , వన్డే , టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కి గురైంది. దీనికి ప్రధాన కారణం ...భారత్ బ్యాటమెన్స్ ఘోరంగా ఫెయిల్ కావడమే. ముఖ్యంగా కెప్టెన్ , కీలక ఆటగాడైన కోహ్లీ ఈ సీరీస్ లో ఘోరంగా విఫలం అయ్యాడు. మూడు ఫార్మాట్లలో కో‍హ్లీ 218 పరుగులే చేశాడు.

ఇక టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ ...ఈ ఓటమి పై స్పందిస్తూ మా ప్రణాళికలను అమలు పరచడంలో విఫలమవ్వడం.. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యామని తెలిపాడు. అంతేకాకుండా తమ ఓటమికి ఎలాంటి సాకులు లేవని, ప్రత్యర్ధి జట్టు వ్యూహాలకు కట్టుబడి విజయాన్నందుకుందన్నాడు. అయితే ప్రశ్నల సెషన్‌లో ఓ జర్నలిస్ట్ మైదానంలో కోహ్లీ అసభ్యకర ప్రవర్తనను ప్రస్తావించాడు. దీనితో కోహ్లీ రిపోర్టర్ల పై రెచ్చిపోయాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కెప్టెన్ విలియమ్స్, ప్రేక్షకుల‌ను పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించారని రిపోర్టర్ ప్రశ్నించగా.. అన్ని తెలుసుకొని మాట్లాడాలని ఏదీ తెలియకుండా ప్రశ్నలతో విసిగించవద్దని , గ్రౌండ్ లో జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చి మాట్లాడాలని హితవు పలికాడు. ఇప్పటికే మ్యాచ్ రిఫ‌రీకి సంజాయిషీ ఇచ్చాన‌ని కోహ్లీ తెలిపారు. ఆ సంఘ‌ట‌న‌ను ఆధారం చేసుకుని వివాదం సృష్టించే ప్రయ‌త్నం చేయ‌వ‌ద్దని హిత‌వు ప‌లికాడు.

కాగా , రెండో టెస్ట్‌ రెండో రోజు సహనం కోల్పోయిన కోహ్లీ మైదానం లో అభ్యంతరకరం గా ప్రవర్తించాడు. ఎన్నడు లేని విధంగా ప్రత్యర్థి ఆటగాళ్లు, ప్రేక్షకుల వైపు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అభ్యంతరకర సైగలు చేశాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డవ్వడం తో.. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి.