Begin typing your search above and press return to search.
గంగూలీకి మరో షాకిచ్చిన విరాట్ కోహ్లీ
By: Tupaki Desk | 17 April 2023 9:01 PM GMTరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) బ్యాట్స్‌మెన్ , భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పగతో రగిలిపోతున్నారు. పాత పగలను మరిచిపోలేకపోతున్నారు. అందుకే తనను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు కారణమైన అప్పటి బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. గంగూలీ బీసీసీఐ చీఫ్ గా ఉన్నప్పుడే కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు వచ్చింది. గంగూలీ బీసీసీఐ చీఫ్ పదవి నుంచి వైదొలిగాక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) మెంటార్ గా ఐపీఎల్ లో కొనసాగుతున్నారు. ఇటీవల ఢిల్లీతో జరిగిన బెంగళూరు మ్యాచ్ లో గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అతడిని ఓరగా చూస్తూ కోహ్లీ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు మైదానంలోనే కాదు.. బయట కూడా బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కోహ్లీ షాక్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు సమాచారం.
శనివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించిన తర్వాత డీసీ మెంటర్ గంగూలీతో కోహ్లీ కరచాలనం చేయడాన్ని తప్పించుకున్నాడు. అలా గంగూలీని కోపంగా చూస్తూ పక్కకు తప్పుకున్నాడు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసి మరో షాకిచ్చాడు.
శనివారం మ్యాచ్ ముగిసిన తర్వాత డీసీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తో సంప్రదాయంగా ప్రకారం హ్యాండ్‌షేక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఆ వెనుకాలే క్యూలో వస్తున్న గంగూలీతో కరచాలనం చేయకుండా స్కిప్ చేయడం వీడియోలో కనిపించింది. ఇది కావాలనే చేసినట్టుగా అర్థమైంది.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ టీ20I కెప్టెన్‌గా వైదొలగడానికి గంగూలీనే కారణమన్న ఆరోపణలున్నాయి. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వన్డే జట్టు కెప్టెన్‌గా కూడా కోహ్లీ తొలగించబడ్డాడు.
2021లో భారత దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ వన్డే కెప్టెన్సీ మార్పు గురించి బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తపరిచాడు. తనకు , సెలక్షన్ కమిటీకి మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదని.. టెస్ట్ సిరీస్‌ల ఎంపిక సమావేశానికి గంట ముందు తనను తొలగిస్తున్నారని చెప్పారని.. దీనివెనుక బీసీసీఐ చీఫ్ ఉన్నాడని ఆరోపించాడు. కెప్టెన్సీపై సెలక్టర్లు, గంగూలీని గట్టిగా నిలదీశానని కోహ్లి విరుచుకుపడ్డాడు.
ఇప్పుడు ఆ పగ ప్రతీకారంతోనే మైదానంలో షేక్ హ్యాండ్ ఇవ్వని విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసి షాకిచ్చినట్టుగా అర్థమవుతోంది.