Begin typing your search above and press return to search.
కోహ్లి మంచి పని చేశాడబ్బా..
By: Tupaki Desk | 17 Sep 2017 7:36 AM GMTభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ కూడా మద్యం ప్రకటనలకు ప్రచారం చేసింది లేదు. దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా అయితే జట్టు తరఫున ధరించే జెర్సీల మీద కూడా మద్యం సంస్థ లోగో వేసుకోవడానికి అంగీకరించకపోవడం వల్ల అతను చాలా ఆదాయం కోల్పోతున్నాడు. ఇలాగే ఇంకొంతమంది ప్రముఖ క్రీడాకారులు తమ అభీష్టం మేరకు కొన్ని బ్రాండ్స్ ప్రచారం చేయడానికి అంగీకరించరు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఈ జాబితాలోకి చేరాడు. అతను ఇకపై కూల్ డ్రింక్స్.. ఫెయిర్ నెస్ క్రీములకు సంబంధించిన ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కొన్నేళ్ల పాటు ప్రచారం చేసిన పెప్సి బ్రాండ్ కు అతను గుడ్ బై చెప్పేశాడు. అలాగే ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండును కూడా వదులుకున్నాడు. ఇకపై ఏ కూల్ డ్రింక్.. ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్లకూ ప్రచారం చేయకూడదని కోహ్లి నిర్ణయించుకున్నాడట. తాను వాడనివి.. మంచివి కావు అనుకున్న వాటిని జనాల మీద రుద్దడం కరెక్ట్ కాదని కోహ్లి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదన్నది వాస్తవం. కానీ సెలబ్రెటీలు ఆ సంగతి పట్టించుకోకుండా వాటిలో మజా అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రకటనలు చేస్తారు. యూత్ కూల్ డ్రింక్స్ ను అంతగా ఇష్టపడటానికి సెలబ్రెటీలు పరోక్షంగా ఓ కారణం అనడంలో సందేహమే లేదు. అలాగే ఫెయిర్ నెస్ అనే కాన్సెప్టే రంగు తక్కువగా ఉండటాన్ని తక్కువ చేసి చూపించడమే. అదో రకమైన వివక్ష. అందుకే కంగనా రనౌత్ లాంటి వాళ్లు ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు కోహ్లి కూడా ఇదే బాటలో నడిచాడు. అతను నో అన్నంత మాత్రాన ఈ బ్రాండ్లు ఆగిపోవు. వాటి ప్రచారమూ ఆగిపోదు. కానీ కోహ్లి ఇలా వ్యతిరేకించడం వల్ల ఎంతో కొంత పాజిటివ్ ప్రభావం ఉంటుంది. తన వంతుగా అతను ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచి పరిణామమే. అతడికి వేరే బ్రాండ్లను ఎంచుకునే ఛాయిస్ ఉన్నపుడు వీటికి ప్రచారం చేయాల్సిన అవసరమైతే లేదు. ఇప్పుడు డిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఓకే.. కానీ డిమాండ్ లేనపుడు కూడా ఇలాగే వ్యవహరిస్తాడా అన్నది ప్రశ్న.