Begin typing your search above and press return to search.

ఇన్ స్టాతోనూ కోహ్లీకి ఎంత ఆదాయమో తెలుసా?

By:  Tupaki Desk   |   7 Jun 2020 10:15 AM IST
ఇన్ స్టాతోనూ కోహ్లీకి ఎంత ఆదాయమో తెలుసా?
X
ఆటలోనే కాదు.. ఆర్జనలో కూడా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. ఈ లాక్ డౌన్ కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.

మార్చి 12 నుంచి మే 14 వరకు సేకరించిన డేటా ప్రకారం.. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఇన్ స్టా గ్రామ్ ద్వారా సంపాదనలో ఏకంగా 6వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ లాక్ డౌన్ కాలంలో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా ఏకంగా రూ.3 కోట్ల 63 లక్షలు సంపాదించారు. అంటే ఒక్క పోస్టు విలువ రూ.1కోటీ 21 లక్షలు అన్నమాట..

ఈ ఇన్ స్టాగ్రామ్ సంపాదనలో పోర్చుగల్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రోనాల్డో రూ.17కోట్ల 24లక్షలతో టాప్ లో కొనసాగుతున్నాడు. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ (రూ.11.50 కోట్లు) - నెయ్ మర్ (రూ.10.53 కోట్లు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇక ఫుట్ బాల్ లో తొలి బిలియనీర్ గా క్రిస్టియానో రొనాల్డో అవతరించాడు. టీమ్ స్పోర్ట్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ఫుట్ బాలర్ గా రికార్డులెక్కాడు. గత ఏడాదిలో రొనాల్డో సంపాదన రూ.793 కోట్లు. బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మూడో ఆటగాడు ఇతడు...