Begin typing your search above and press return to search.

మరీ ఇంత క్రూరత్వమా.. హత్రస్ నిందితులను శిక్షించాలి : కోహ్లీ

By:  Tupaki Desk   |   30 Sep 2020 6:00 AM GMT
మరీ ఇంత క్రూరత్వమా.. హత్రస్ నిందితులను శిక్షించాలి : కోహ్లీ
X
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కామాంధులు చెలరేగిపోతున్నారు.ఒక వైపు మీరట్ లో గ్యాంగ్ రేప్ పై నిరసనలు చేస్తుంటే మృగాళ్లకు ఇవేమి పట్టడం లేదు. వరుస బెట్టి అత్యాచారాలకు ఒడిగడుగుతున్నారు. హత్రస్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి మంగళవారం ఢిల్లీలో ప్రాణాలు కోల్పోవడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హత్రస్ లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు దుండగులు..ఆమెను చిత్ర హింసలు పెట్టారు. ఆమె నాలుకను కూడా కోసి క్రూరంగా ప్రవర్తించారు. చికిత్స కోసం ఢిల్లీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ అత్యాచార ఘటనపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. అది అమానవీయ, క్రూరత్వానికి మించిన ఘటన అని ఆవేదన వ్యక్తంచేశాడు. ‘హత్రస్‌లో జరిగిన ఘటన అమానవీయమైనది. క్రూరత్వానికి మించినది. దానికి కారకులైన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని ఆశిస్తున్నా’’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు.

రెండు వారాల క్రితం హత్రస్‌ లో ఓ దళిత యువతిపై అగ్ర వర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను తీవ్రంగా హింసించారు. క్రూరంగా ప్రవర్తించి ఆమె నాలుకను కూడా కోశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హత్రస్ ఘటన ను దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటన పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.