Begin typing your search above and press return to search.

కోహ్లికి ఎందుకంత కోపం వచ్చింది?

By:  Tupaki Desk   |   29 March 2016 7:01 AM GMT
కోహ్లికి ఎందుకంత కోపం వచ్చింది?
X
అనుష్క శర్మతో విరాట్ కోహ్లికి బ్రేకప్ అయిపోయి.. మూణ్నాలుగు నెలలైంది. ఈ మధ్యలో ఏ రోజూ అనుష్క ఊసే ఎత్తలేదు విరాట్. ఐతే ఇప్పుడు అనుకోకుండా ఆమె పేరెత్తాడు. ఆమెపై చెలరేగుతున్న విమర్శల బౌన్సర్లను తిప్పి కొట్టే ప్రయత్నం చేశాడు. తన మాజీ లవర్ చాలా మంచిదన్నాడు. ఆమెనెందుకు ఆడిపోసుకుంటారంటూ మండిపడ్డాడు. తనపై విమర్శలు చేసే వాళ్లు సిగ్గుపడాలన్నాడు. అనుష్క తనకెప్పుడూ పాజిటివ్ ఎనర్జీనే ఇచ్చిందంటూ ఆమెకు కితాబిచ్చాడు.

విరాట్ కోపం అర్థం చేసుకోదగ్గదే. లేకుంటే అతడి ప్రతిభను.. వైఫల్యాన్ని.. రెండింటినీ అనుష్కకే కట్టబెట్టేస్తే ఒళ్లు మండదా మరి. తన కష్టాన్ని.. తన ప్రతిభను.. తన నైపుణ్యాన్ని.. తన పట్టుదలను.. తన మనో నిబ్బరాన్ని.. తన సాధనను.. వేటినీ గుర్తించకుండా కేవలం అనుష్కకు దూరం కావడం వల్లే విజయవంతం అవుతున్నానంటే ఆగ్రహం రాదా మరి. ఏ ఆటగాడికైనా సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది కామన్.

అనుష్క ఉన్నపుడు కూడా కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. కానీ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే జనాలకు అనుష్క కనిపించింది. ఇప్పుడు అనుష్కకు దూరమయ్యాక విరాట్ విజయాలు కనిపిస్తున్నాయి. విరాట్ లాంటి గొప్ప ఆటగాడి ప్రతిభను.. ఓ అమ్మాయితో వ్యవహారానికి ముడిపెట్టి చూడటం కంటే సంకుచితత్వం మరొకటి ఉండదు. ఇలాంటి వ్యక్తుల్ని విరాట్ అలా వాయించడంలో తప్పేమీ లేదు. అందుకే విరాట్ మ్యాచ్ లోనే కాక.. ట్విట్టర్లో కూడా హార్డ్ హిట్టింగ్ చేశాడు.