Begin typing your search above and press return to search.
ముప్పేట దాడి.. దిగొచ్చిన కోహ్లి
By: Tupaki Desk | 9 Nov 2018 5:42 AM GMTఎప్పుడు ప్రశంసల్లో మునిగి తేలే భారత స్టార్ బ్యాట్స్ మన్, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా రెండు రోజులుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కోహ్లి ఓవర్ రేటెడ్ బ్యాట్స్ మన్ అని, తనకు భారత బ్యాట్స్ మెన్ కంటే ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెనే నచ్చుతారని ఒక అభిమాని పేర్కొనడంపై ఆగ్రహించిన విరాట్.. అలా అయితే ఇండియాలో ఎందుకున్నావు.. వేరే దేశానికి వెళ్లిపో అంటూ కోహ్లి చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై ఇటు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం విమర్శలు గుప్పించారు.
ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందిస్తూ.. కోహ్లి స్పందించిన తీరు సరిగా లేదన్నాడు. సెలబ్రెటీలు ఒక బుడగలో చిక్కుకుంటారని.. కోహ్లి కూడా ఆ దారిలోనే నడిచాడని.. సెలబ్రెటీలు ఇలాంటి వాటిలో పడకూడదని అన్నాడు. మరోవైపు ప్రముఖ నటుడు సిద్దార్థ్ కొంచెం తీవ్ర స్వరంతోనే కోహ్లికి చురకలంటించాడు. ఇలాంటి ప్రశ్న రాహుల్ ద్రవిడ్ కు ఎదురైతే.. ఎలా స్పందించేవాడో ఆలోచించాలని అన్నాడు. భారత కెప్టెన్ నుంచి ఇలాంటి మాటలు రావడం సిగ్గు చేటన్నాడు. ఇక నెటిజన్లయితే కోహ్లిని మామాలుగా తూర్పారబట్టలేదు. ఈ వ్యతిరేకత చూశాక కోహ్లి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
సదరు అభిమాని ‘దీస్ ఇండియన్స్’ అంటూ తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడని.. దాన్ని ఉద్దేశించే తాను ఆ కామెంట్ చేశానని.. అంతే తప్ప ఎవరి ఛాయిస్ ఎలా అయినా ఉండొచ్చని అన్నాడు. తనను ట్రోల్ చేసేవాళ్లు చేసుకోవచ్చని కోహ్లి చెప్పాడు. కోహ్లి ఎలా కవర్ చేసుకున్నప్పటికీ.. ఒక మామూలు అభిమాని ఏదో అంటే దానికి అతను అంత తీవ్ర స్వరంతో స్పందించడం.. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి నోరు జారడం సమంజసం కాదు. మైదానంలో ఎంత దూకుడుగా ఉన్నా ఓకే కానీ.. బయట మాట్లాడేటపుడు జాగ్రత్తగా లేకుంటే కష్టం.