Begin typing your search above and press return to search.
ఇద్దరు లెజెండ్స్ ఫొటో మూమెంట్ వైరల్
By: Tupaki Desk | 7 April 2023 6:21 PM GMTఒకరు సినిమా రంగంలో లెజెండ్ కాగా మరొకరు క్రికెట్ లో లెజెండ్. వీరి కలయిక కోట్లాది మంది అభిమానులకు కన్నుల విందు చేసింది. వీరే షారుఖ్ ఖాన్ మరియు విరాట్ క్లోహీ. వీరిద్దరు కలిసి ఇలా ఈడెన్ గార్డెన్స్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఐపీఎల్ మ్యాచ్ తర్వాత నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని అయిన షారుఖ్ ఖాన్ మరియు కోహ్లీ కలిశారు. వారిద్దరు కొద్ది సమయం ఇలా సరదాగా ముచ్చటించుకున్నారు. ఆ సందర్భంగా మీడియా వారు కెమెరాకు పని చెప్పారు.
సినిమా లతో బిజీగా ఉన్నా కూడా షారుఖ్ ఖాన్ తన జట్టు మ్యాచ్ ను చూసేందుకు హాజరు అయ్యాడు. జట్టును ఉత్తేజ పర్చుతూ జట్టు లో ఉత్సాహం నింపుతూ వచ్చాడు. తాజాగా మరోసారి తన జట్టు కు ఆడిన మ్యాచ్ సందర్భంగా షారుఖ్ ఖాన్ సందడి చేశాడు.
మ్యాచ్ జరుగుతున్నంత సమయం కోహ్లీ జట్టు పై ఆధిపత్యం చూపించాలంటూ తమ జట్టు సభ్యులను ఉత్సాహపర్చిన షారుఖ్ మ్యాచ్ పూర్తి అయిన తర్వాత క్రీడా స్ఫూర్తిని కనబర్చుతూ కోహ్లీతో ఇలా ముచ్చటించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు మీమర్స్ ఈ ఫొటోలను తెగ వాడేసుకుంటూ ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.