Begin typing your search above and press return to search.
విరాట్ కోహ్లి - ఎంఎస్ ధోనీ భార్యలు క్లాస్ మేట్స్?
By: Tupaki Desk | 31 May 2023 12:00 PM GMTభారతదేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ అసాధారణమైనది. క్రికెట్ ఆటగాళ్లను దేవుళ్లతో సమానంగా ఆరాధిస్తారు. ''క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు..ఇది ఒక మతం'' అంటే అతిశయోక్తి కాదు. టీమిండియా మాజీ రథసారథులు MS ధోని - విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
ఆ ఇద్దరినీ సమకాలీన ప్రపంచంలో అభిమానులు దేవుళ్ళుగా పరిగణిస్తారు. అయితే ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది. MS ధోని -విరాట్ కోహ్లి విషయంలోను ఇదే నిజం. ఎందుకంటే మాజీ క్రికెట్ కెప్టెన్ల భార్యలు తమ భర్తల స్థిరమైన ఆట తీరుకు అదనపు బలం.
అయితే కోహ్లీ భార్య అనుష్క శర్మ .. ధోని భార్య సాక్షి మధ్య అనుబంధం గురించి ఎందరికి తెలుసు? ఆ ఇద్దరూ క్లాస్ మేట్స్ అన్న విషయం ఎవరికైనా తెలుసా? అంటే అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే తెలిసిన విషయమిది. నిజానికి టీమిండియా మాజీ రథసారథులకు ఆ ఇద్దరూ భార్యలు కాక ముందే మంచి స్నేహితులు. కానీ ఇది చాలా మందికి తెలియదు.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. సాక్షి ధోని అస్సాంలోని ఒకే పాఠశాలలో చదువుకున్నారు. తాజాగా ఆ ఇద్దరూ పాఠశాలలో చదువుకునేప్పుడు దిగిన కొన్ని త్రోబ్యాక్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అనుష్క శర్మ ఆర్మీ నేపథ్యానికి చెందిన కుటుంబంలో జన్మించింది. దాని కారణంగా దేశంలోని పలు నగరాల్లో చదువుకుంది. అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ అస్సాంలో జాబ్ చేసేప్పుడు 'మార్గరీటా'లోని సెయింట్ మేరీస్ స్కూల్ కు వెళ్లింది. అందులో సాక్షి కూడా చదువుకుంది. అప్పట్లో ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన త్రోబాక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక ఫోటోలో అనుష్క- సాక్షి.. అనుష్క సోదరుడు కర్నేష్ సహా ఇతర స్నేహితులు పోజులివ్వడం కనిపించింది. మరొక ఫోటోలో సెలబ్రిటీ వైవ్స్ వారి స్కూలింగ్ ప్రారంభ రోజుల్లో కామన్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకుంటూ కనిపించారు. మొదటి తరగతిలో అనుష్క - సాక్షి గ్రూప్ క్లాస్ ఫోటో ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలను అభిమానులు తమ సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు.