Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూశాక.. దీన్ని షేర్ చేయకుండా ఉండటం అసాధ్యం బాస్

By:  Tupaki Desk   |   2 Jan 2022 4:37 AM GMT
ఈ వీడియో చూశాక.. దీన్ని షేర్ చేయకుండా ఉండటం అసాధ్యం బాస్
X
రెండు నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చూసినంతనే చిరునవ్వు ముఖం మీదకు రావటం.. ఆ వెంటనే.. మీ వేళ్ల కొసల నుంచి ఈ వీడియోను మొబైల్ నుంచి కనీసం ఇద్దరు.. ముగ్గురికైనా షేర్ చేయకుండా ఉండలేని పరిస్థితి. ఇలాంటివాళ్లు కూడా ఉంటారా? అన్నట్లుగా ఉన్న ఈ వీడియో.. ఎక్కడ జరిగింది? అన్న వివరాలు మాత్రం తెలీటం లేదు.

కాకుంటే.. కొత్త సంవత్సరం వేళ కొన్ని గ్రూపుల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో అంతకంతకూ ఫార్వర్డ్ అవుతోంది. కోడి అన్నంతనే.. కోసుకు తినేయటమే అన్న మాట నూటికి తొంభైతొమ్మిది మంది నోటి నుంచి ఇదే మాట వస్తుంది. కానీ.. అలాంటి కోడిని అల్లారు ముద్దుగా పెంచేటోళ్లు కొందరు ఉంటారు. దానికి జీడిపప్పు.. బాదంపప్పులు పెట్టి పెంచేటోళ్లు ఉంటారు. సంక్రాంతి పండక్కి నిర్వహించే కోళ్ల పందాల కోసం సిద్ధం చేయటం తెలిసిందే.

దీనంతటికి మించి.. కోడిని అల్లారు ముద్దుగా.. ఇంట్లో పిల్లల మాదిరి పెంచటమే కాదు.. దానికి సెకండ్ బర్త్ డే పార్టీని నిర్వహించే అరుదైన సీన్ ఈ వీడియోలో కనిపిస్తుంటుంది. కోడి పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయటం.. ఇంటిని అందంగా అలంకరించటమే కాదు.. దాని కోసం ప్రత్యేకంగా ఒక కేక్ సిద్ధం చేయటం.. ఇరుగుపొరుగు వారిని పిలిచి.. దాన్నో వేడుకగా చేయటం చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ వీడియోను చూస్తున్నప్పుడు.. దాన్ని కోడి అనే మాట కంటే.. పేరు పెట్టి పిలవటం.. దాని కాళ్ల మధ్య కత్తి పెట్టి.. కేక్ కట్ చేయటమే కాదు.. దానికి చిన్ని కేక్ ముక్కును పెట్టి.. అది తిన్నందుకు సంబరపడిపోవటం చూస్తే.. ఇలాంటివి కూడా జరుగుతాయా? అన్న భావన కలగటం ఖాయం. ఇప్పటివరకు ఇంట్లో పెంచుకునే కుక్కలకు.. పిల్లులకు బర్త్ డే పార్టీలు చూసి ఉంటారు. కానీ.. కోడికి సెకండ్ బర్త్ డే అంటూ చేసిన ఈ బర్త్ డే పార్టీ మాత్రం నభూతో నభవిష్యతి.. అని మాత్రం చెప్పక తప్పదు. మీరేమంటారు?