Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: ఆ అధికారులను మించిన కోతి.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   31 Oct 2021 2:30 AM GMT
వైరల్ వీడియో: ఆ అధికారులను మించిన కోతి.. ఎందుకో తెలుసా?
X
సహజంగా చిన్న పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు కోతితో పోలుస్తారు. అల్లరి మితిమీరితే కోతి పనులు చేయకు అంటూ వారిస్తారు. అయితే నిజానికి కోతులు చేసే పనులు మాములుగా ఉండవు. కోతుల అల్లరిని మాటల్లో వర్ణించలేం. ఈ అల్లరితో నానా హంగామా చేస్తాయి. ఇక ఊళ్లలో అయితే ఇళ్లలో ఎగబడి మరీ ఎత్తుకెళ్తాయి. వివిధ వస్తువులను ఇష్టానుసారంగా పడేస్తాయి. అందుకే ఎంతటి వ్యక్తి అయినా సరే వీటికి భయపడతారు. కానీ ఆ ఐపీఎస్ ఆఫీసర్ మాత్రం భలే తెలివిగా ఆలోచించారు. ఆ కోతిని ఎలా నియంత్రించాలో చక్కగా అర్థమైంది కాబోలు ఆయనకు. అందుకే ఆ అధికారి చేసిన పనికి కోతి కూడా సెట్ అయింది. నిజానికి మనుషులు లంచమిస్తే మనకు కావాల్సింది ఇస్తారు. అదే తరహాలో ఆ కోతి కూడా లంచం గురించి తెలియకుండానే.. పుచ్చుకుంది. తనకు కావాల్సిన మొత్తంలో అందుకున్నాకే చేతిలో ఉన్న వస్తువును వదిలేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


ఐపీఎస్ రూపిన్ శర్మి కళ్లజోడు ఆ కోతి కంటపడింది. ఆ కళ్లజోడును తీసుకున్న కోతి సరాసరి పరిగెత్తింది. పైగా ఆ కళ్లజోడు తీసుకొని ఓ ఎత్తైన గోడ మీద కూర్చుంది. చేతిలోని ఆ గ్లాసెస్ ను తదేకంగా చూస్తూ గోడపై అలాగే ఉంది. కోతి చేసిన పనితో తొలుత ఆ అధికారి కాస్త కంగారు పడ్డారు. ఆ తర్వాత ఓ మెరుపులాంటి ఆలోచన ఆయనకు తట్టింది. అంతే క్షణాల్లో ఆ కళ్లజోడు ఆఫీసర్ చేతిలోకి వచ్చి చేరింది. ఇంతకీ ఆయన ఏం చేశాండంటే.. సింపుల్... ఆ కోతికి ఐపీఎస్ ఆఫీసర్ లంచం ఇచ్చారు. అంతే అది దానిని యాక్సెప్ట్ చేసి మరీ... కళ్లజోడును వదిలేసింది.

కోతి చేతిలో ఉన్న కళ్లజోడును తీసుకోవడం కోసం ఆ అధికారి చిన్న ప్లాన్ వేశారు. జ్యూస్ కవర్ ను కోతికి అందించారు. అంతే రుచికరమైన జ్యూస్.. ఆకట్టుకునే కవర్ ను చూడగానే ఆ కోతి టెమ్ట్ అయింది. అలా జ్యూస్ ప్యాక్ ను తీసుకున్న కోతి.. వెంటనే తన చేతిలోని కళ్లజోడును కిందపడేసింది. అంతేకాకుండా జ్యూస్ కవర్ ను చేతిలో పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కోతి కళ్లజోడు ఎత్తుకెళ్లడం, ఆ గ్లాసెస్ తో ఆటలాడడం, చివరకు జ్యూస్ తో పరారీ అయిన దృశ్యాలు చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.


కళ్లజోడును ఎత్తుకెళ్లిన కోతి... జ్యూస్ ప్యాక్ కోసం వదిలేసిన తీరు నవ్వు పుట్టించే విధంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే లంచాలను తీసుకునే అధికారులను ఈ కోతి మించిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకే జ్యూస్ ప్యాకెట్ ఇవ్వగానే తన చేతిలోని కళ్లజోడును వదిలేసిందని అంటున్నారు. లంచమిస్తేనే ఇక్కడ పని జరుగుతుంది బ్రదర్ అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ ఫన్నీ అండ్ వైరల్ వీడియోను మీరూ ఓ సారి చూసేయండి మరి..!