Begin typing your search above and press return to search.

చీర‌లో తెలంగాణ ఇల్లాలి బైక్ రైడ్ వైర‌ల్‌

By:  Tupaki Desk   |   27 Nov 2017 11:41 AM GMT
చిన్న‌ప్ప‌టి నుంచి ఝాన్సీ ల‌క్ష్మీభాయి చ‌రిత్ర చ‌దువుకుని పెరిగిన పిల్లాడు... పెద్ద‌య్యాక స్త్రీ ని త‌న‌తో స‌మానంగా చూస్తాడ‌ని గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే... నేర్చుకున్న జ్ఞానం కంటే స‌మాజం ప్ర‌భావ‌మే జ‌నం మీద ఎక్కువ‌గా ఉంటుంది. ఆకాశంలో స‌గం, భూమాత కంటే గొప్ప‌ది అనుకుని స‌ద‌స్సులు పెట్టుకుని పొగ‌డ‌టమే త‌ప్ప‌... స్త్రీ శ‌క్తిని గుర్తించ‌డం లేదు. ఆమెను ప్ర‌త్యేకంగా చూడ‌క్క‌ర్లేదు... ఆమె కూడా మ‌న లాంటి వ్య‌క్తే. కాక‌పోతే నీకు అవ‌కాశం వ‌చ్చింది ఇలా ఉన్నావు. ఆమెకు అవ‌కాశం రాలేదు అలా ఉంది. అంతే తేడా... అయితే, ఈ మ‌ధ్య‌న మ‌గువలు అడుగు పెట్టిన ప్ర‌తి చోటా రాణిస్తున్నారు. మ‌గువ ఇల్లాలు మాత్ర‌మే కాదు... అంత‌కుమించి అని త‌మ సత్తా ఏంటో చూపుతున్నారు. ఇదిగో ఈ వీడియో చూడండి. ఒక తెలంగాణ ప‌ట్ట‌ణంలో త‌నతో పాటు మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను బైకులో ఎక్కించుకుని చాలా కూల్ గా రైడ్ చేస్తోంది ఈ తెలుగింటి ఆడ‌ప‌డుచు. చిత్రం ఏంటంటే... చీర క‌ట్టులో అది కూడా కాలేజీ కుర్ర‌కారు న‌డిపే య‌మ‌హా ఆర్‌15 సిరీస్ బైకులో ముగ్గురితో రైడ్ చేసింది ఈ మ‌హిళా మ‌ణి క‌ర్ణిక‌. ఈరోజే వెలుగు చూసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో నిమిషాల్లోనే వేల‌కు వేలు షేర్ల‌ను న‌మోదు చేసింది. మీరూ చూడండి. మ‌హిళ‌నా మ‌జాకా?! ఈ వీడియో ఏ ఊర్లో తీసింద‌నే విష‌యం వెలుగులోకి రాలేదు.