Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో : ఓటర్లను బెదిరించే రోజులొచ్చాయ్
By: Tupaki Desk | 17 Feb 2021 12:51 PM GMTపంచాయతీ ఎన్నికల్లో నేతల బరితెగింపులు పెరిగిపోయాయి. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రజలను వేడుకునే రోజులు పోయాయి. ప్రజలను ఓట్లు వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వీడియోలో అధికార పార్టీ నేత బెదిరింపులు వైరల్ అయ్యాయి.
వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల మండలంలో వైసిపి నాయకుడు చిరంజీవి ప్రతిపక్షానికి ఓటు వేయడానికి వీల్లేదని.. అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలను బెదిరిస్తున్న వీడియో వైరల్ గా మారింది.
"ప్రతిపక్ష టీడీపీ నేత సర్పంచ్ ఎన్నికలలో గెలిచినా, నేను ఎంపిపి (మండలా పరిషత్ ప్రెసిడెంట్) అయ్యాక గ్రామానికి రూపాయి నిధులు రావు. ప్రతిపక్ష నాయకుడి చెక్ పవర్ ను రెండు నెలల్లో తొలగిస్తాను. స్థానిక నాయకులు ఏమీ చేయలేరని అనుకోకండి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఫరీద్‌పేటలోని పెన్షన్ పథకం నుండి 40 మంది లబ్ధిదారుల పేర్లను తొలగించాను ”అని చిరంజీవి అన్న మాటలు కలకలం రేపాయి. ఇదిప్పుడు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇక్కడ ఆగకుండా, చిరంజీవి అనే నేత అధికార పార్టీకి ఓటు వేయని వ్యక్తులకు అందే పథకాలను ఖచ్చితంగా ఆపివేస్తానని, ఈ నెల 21 తర్వాత మేము దీన్ని చేసి చూపిస్తామని హెచ్చరించాడు.ప్రజలకు చిరంజీవి చేసిన ఈ హెచ్చరిక వీడియో వైరల్ అయింది. రాజకీయ పార్టీలు, మేధావులు దీనిపై మండిపడుతున్నారు. ఈ నాయకుడి హెచ్చరిక వైయస్ఆర్సిపి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది.