Begin typing your search above and press return to search.
వైరల్ పిక్.. మద్యం బ్రాండ్లతో నారా లోకేష్ సెల్ఫీ!
By: Tupaki Desk | 4 March 2023 12:23 PM GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 27న చిత్తూరు జిల్లాలోని తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు మొత్తం 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది. ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేపట్టి మార్చి 3 నాటికి 33 రోజులు పూర్తయింది. ఇప్పటివరకు ఆయన 437 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
తన పాదయాత్రలో భాగంగా లోకేష్ వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, రైతులు, కూలీలు, వలస కార్మికులు, కౌలు రైతులు, ముస్లింలు.. ఇలా పలువురితో ముఖాముఖి సమావేశాలు జరుపుతున్నారు. వారి కోరికలను సావధానంగా వింటున్నారు. తాము అధికారంలోకి రాగానే వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ చెబుతున్నారు.
కాగా పుంగనూరు నియోజకవర్గం కొత్తపేటలో ప్రభుత్వ మద్యం తీసుకుని వెళ్తున్న వ్యాన్ వద్ద నారా లోకేష్ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ వ్యాన్‌లోని 'బూమ్ బూమ్', 'బ్లాక్ బస్టర్', 'మలబార్ హౌస్', 'మెలిస్సా' తదితర బ్రాండ్లను చూపుతూ లోకేష్ సెల్ఫీలు దిగారు.
"బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, మలబార్ హౌస్ బ్రాండ్ల యజమాని #ఒఆట్చnఛీటతోపాటు సహ యజమాని 'క్రూయెల్' పెద్దిరెడ్డి ఉన్న మద్యం బ్రాండ్లతో పుంగనూరులో సెల్ఫీ తీసుకున్నాను. చౌక మద్యాన్ని ప్యాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. అందులో వచ్చే ఆదాయం తాడేపల్లి ఖజానాకు చేరుతోంది. అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది" అని లోకేష్ మండిపడ్డారు.
'తనను పెద్దాయన అని పిలవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆదేశించారని చెబుతున్నారని లోకేష్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ, అటవీ, రైతుల భూములు ఆక్రమిస్తున్నందుకు, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నందుకు, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నందుకు, పాడి, మామిడి రైతుల శ్రమను దోచుకుంటున్నందుకు పెద్దాయన అని పిలవాలా? అని నిలదీశారు. మామిడి పంటనూ మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్పింగ్ పరిశ్రమకే అమ్మాలని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.
నాలుగేళ్లలో పెద్దిరెడ్డి రూ.10వేల కోట్లు అక్రమంగా సంపాదించారని లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి పాపాలు బయటపెడతాం అని ప్రజలను లోకేష్ హెచ్చరించారు. కాగా కొత్తపేటలో టపాసులు కాలుస్తుండగా పోలీసులు అడ్డుకోవడాన్ని కార్యకర్తలు నిరసిస్తూ నినాదాలు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.