Begin typing your search above and press return to search.

గుండె తడిని పెంచిన ఈ 'దృశ్యం'

By:  Tupaki Desk   |   26 Aug 2018 5:46 AM GMT
గుండె తడిని పెంచిన ఈ దృశ్యం
X
ఒక్క సిరాచుక్క.. లక్ష మెదళ్ల కదలిక అన్నాడో మహాకవి.. అలాగే వందమాటల్లో చెప్పలేనిది.. ఒక దృశ్యంతో చెప్పొచ్చంటారు. అలాంటిదే ఈ దృశ్యం.. ఈ ఒక్క ఫొటో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ సంఘటన గురించి విన్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరగడం మొదలైంది. ఈ వార్త చదివిన కన్నబిడ్డలు తమ తల్లిదండ్రుల విలువేంటో తప్పక గ్రహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఓ స్కూలు బాలిక, ఓ వృద్ధురాలి పక్కన కూర్చొని గుక్కపెట్టి ఏడుస్తున్న ఓ ఫొటో ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫొటోలోని బాలిక ఓ వృద్ధాశ్రమానికి వెళ్లింది. క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా స్కూలు యాజమాన్యం విద్యార్థులను ఇలా వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ అనూహ్యంగా ఆ బాలిక తన నానమ్మను చూసింది. ఇన్నాళ్లు నానమ్మ చుట్టాల ఇంటికి వెళ్లి వారివద్దే ఉందని చెప్పిన అమ్మానాన్న మాటలు అబద్దమని ఆ బాలికకు అర్థమైంది. నానమ్మను వృద్ధాశ్రమంలో చూసి తీవ్రంగా గుక్కపట్టి ఏడ్చింది. గుజరాత్ లోని ఓ ఫొటోగ్రాఫర్ దాదాపు పదేళ్ల కిందట తీసిన ఈ హృదయవిదారక సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోను గుజరాతీ డైలీ ‘దివ్య భాస్కర్’లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. అప్పట్లో ఇది సంచలన టాపిక్. ప్రస్తుతం పదేళ్ల తర్వాత ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది.

గుజరాత్ లోని మనినగర్ లోని జీఎన్సీ స్కూలు ప్రిన్సిపాల్ 2007 సెప్టెంబర్ 12న ఫొటో జర్నలిస్టు కల్పేష్ ఎస్ భరేచ్ ను ఘోదాసర్ లోని మనిలాల్ గాంధీ వృద్ధాశ్రామానికి రమ్మని కాల్ చేశాడు. పిల్లలను వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నామని.. ఈ స్కూల్ ట్రిప్ కవర్ చేయమని ప్రిన్సిపాల్ ఫొటో గ్రాఫర్ ను కోరాడు. భరేచ్ పిల్లలతోపాటు వృద్ధాశ్రమానికి వెళ్లాడు. ఇంతలో ఓ బాలిక ఓ ముసలావిడ దగ్గరకు ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకొని ఏడ్చింది. ఏం జరిగిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ముసాలవిడ చెప్పిన స్టోరీ విని అంతా కన్నీళ్లు పెట్టుకున్నాడు..

ఆ ముసలావిడ స్వయంగా ఆ అమ్మాయికి నానమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురైంది. బాలిక కూడా నానమ్మను పట్టుకొని ఏడ్చింది. నానమ్మ వేరే వాళ్ల ఇంటి దగ్గర ఉందని చెప్పిన నాన్న మాటలు అబద్ధమని.. వృద్ధాశ్రమంలో పడేశారని తెలుసుకొని బాలక గుక్కపట్టి ఏడ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్న ఫొటోపాటు వీరి స్టోరీని గుజరాతీ డైలీ దివ్య భాస్కర్ మొదటి పేజీలో ప్రచురించారు. గుజరాత్ అంతా అది వైరల్ అయ్యింది. అన్ని పత్రికలు - చానళ్లు దీనిపై మానవీయ కోణంలో ప్రచారం చేశాయి. దీంతో ఆ తర్వత ముసలావిడను తన ఇంటికి ఆమె కుమారుడు తీసుకెళ్లాడు.

ప్రస్తుతం దాదాపు `10 ఏళ్ల తర్వాత ఆగస్టు 19న ప్రపంచ ఫొటో గ్రఫీ దినం సందర్భంగా బీబీసీ గుజరాతీ మీడియా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తమ బెస్ట్ ఫొటోలను షేర్ చేయమని కోరింది. తాను తీసిన ఈ ఫొటోను భరేచ్ షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.