Begin typing your search above and press return to search.

ఆ ఫ్యామిలీ.. సకుటుంబ సపరివార ముద్దు.. వైరల్ ఫొటో

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:06 PM GMT
ఆ ఫ్యామిలీ.. సకుటుంబ సపరివార ముద్దు.. వైరల్ ఫొటో
X
'ముద్దంటే చేదా?.. నీకా ఉద్దేశం లేదా?' అంటూ పాటలు పాడుకోవడమేనా? అంటే కరోనాకు ముందు వరకూ ముద్దులు ముచ్చట్లు బోలెడు సాగాయి. కానీ కరోనా తర్వాత ముద్దులు పోయాయి.. ముచ్చట్లు ఎగిరిపోయాయి. అంతా సామాజిక దూరంతో అందరూ బంధాలకు దూరమైపోతున్నారు.

లిప్ టు లిప్ కిస్ అనేది ప్రేమకు చిహ్నం, అదొక అందమైన భావన.. ముద్దు పెట్టుకోవడం అనేది కామన్. ప్రపంచవ్యాప్తంగా 168 రకాల సంస్కృతుల్లో సగానికంటే తక్కువ సమాజాల్లో మాత్రమే పెదవులతో మాట్లాడుతారని ఓ పరిశోధనలో వెల్లడైంది. శృంగారానికి ఈ లిప్ టు లిప్ కిస్ ఎంతో కీలకం.. 46శాతం మంది మాత్రమే పెదవులతో పెదవులకు చుంబనం ఇస్తారని ఓ సర్వేలో వెల్లడైంది.

ఇక హిందువుల వేదాల్లో అధర చుంబనం ప్రాముఖ్యత గురించి 3500 ఏళ్ల కిందటే వర్ణించారు. అసలు ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనుషుల్లో ఎప్పటి నుంచి మొదలైందో చెప్పడానికి రెండు రకాల సిద్ధాంతాలున్నాయి.

నిజానికి మనుషులకు ముద్దు పెట్టుకోవాలనే కోరిక అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సహజంగా కలుగుతుందని తేలింది. మొదటి దాని ప్రకారం పుట్టిన బిడ్డ తన పెదవులతో చనుబాలను తీసుకుంటుంది. అలా తల్లి స్థనాన్ని తాకడానికి ముద్దుకు మధ్య అంతర్లీన సంబంధం ఉండొచ్చు. ఈ భావన ప్రతి ఒక్కరూ అనుభవించేదే.

ముద్దు ఎలాంటిదైనా నిజమైన అనుభూతిని అస్వాదించాలంటే సున్నిత భావాలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం. పెదవులపై పెదవులను అదిమిపెట్టి చుంబనం ఇవ్వడం కేవలం మానవ జాతికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణంగా చెప్పొచ్చు.

తాజాగా ఒక కుటుంబంలో బామ్మ నుంచి మనవడి వరకూ ఓ నాలుగు తరాల వారు తమ భార్యలు/భర్తలతో కలిసి ముద్దు పెట్టుకున్న ఓ అరుదైన ఫొటో వైరల్ అయ్యింది. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా ముద్దిచ్చుకున్నారు. అదీ లిప్ టు లిప్ కిస్.. కరోనా వేళ వీరు చేసిన సాహసాన్ని ఎవ్వరూ కాదనరు. అయినా ప్రేమను మించి అయితే కరోనా కాదు.. ఆ ప్రేమలో మునిగితేలిన వారికి ఈ అంటువ్యాధులు ఏం చేయలేవు.

బహుషా వారింట్లో మనవడి పెళ్లి కావచ్చు. అందులో భాగంగా వారి తల్లిదండ్రులు, తాతలు,ముత్తాతలు కూడా ఇలా అదరచుంభనంతో ఒక్కటైపోయారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.