Begin typing your search above and press return to search.

దేశాన్ని కదిలిస్తోన్న ఢిల్లీ అల్లర్ల చిత్రం

By:  Tupaki Desk   |   1 March 2020 4:50 AM GMT
దేశాన్ని కదిలిస్తోన్న ఢిల్లీ అల్లర్ల చిత్రం
X
ఢిల్లీ అల్లర్ల దారుణాలకు అద్దంపట్టిన ఈ చిత్రం ఇప్పుడు దేశంలోని అందరినీ కదిలిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఘోర కలిని కళ్లకు కడుతోంది. చేతిలో కర్రలు, రాడ్లతో నిస్సహాయుడైన ఓ వ్యక్తిని రక్తమోడుతున్నట్టు కొడుతున్న అల్లరి మూకల దాష్టీకానికి ప్రతీక ఈ చిత్రం.

తెల్లటి కుర్తా-పైజామా మీద మొత్తం రక్తపు మరకలతో నిస్సహాయ స్థితిలో నేలపై వంగి నన్ను కొట్టొద్దు అని తలను దాచుకుంటున్న వ్యక్తి దైన్యం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు మహ్మద్ జుబేర్ 937). ఈశాన్య ఢిల్లీలోని ఆయన ఇంటికి దగ్గర్లో ఉన్న మసీదులో ఏటా జరిగే ఇజ్తెమా మసీదులో పాల్గొని వస్తుండగా అల్లరి మూకలకు చిక్కాడు.

ప్రార్థన చేసుకొని ఇంటికి వెళుతున్న జుబేర్ హిందువుల అల్లరి మూక చూసింది. జంతువును వేటాడినట్టు వేటాడి చుట్టుముట్టి రాడ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సృహ తప్పి పడిపోయాడు. తల్వార్ తో తలపై వేటు వేశాడు. అది తలపై పడకుండా పక్కన పడింది. దీంతో జుబైర్ బతికిపోయాడు. ఇంత తీవ్ర దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు పక్కనే పోతున్నా పట్టించుకోలేదని జుబేర్ తెలిపాడు. దాదాపు 20-25మంది జైశ్రీరాం అంటూ ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఉన్న జుబైర్ ను కొట్టారు. చాలా దెబ్బలు కొట్టాక సృహ తప్పి పడిపోయారు వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఎవరో జుబైర్ ను ఎత్తుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ జుబైర్ కంటే దారునంగా రెండు చేతులు కోల్పోయిన వారికి డాక్టర్లు చికిత్స చేశారు. ఆ తర్వాత జుబైర్ కు చికిత్స చేశారు. దాదాపు తలపై 30 కుట్లు పడ్డాయి. ఇప్పటివరకూ జుబైర్ పై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

‘ఒక మతం వారు కొట్టారని నేను అనను.. ఇది మానవత్వానికి శత్రువులు లాంటి వారు.. మంతాన్ని జోడించవద్దు.. ప్రతీ మతం ప్రేమ, శాంతి సందేశాలనే ఇస్తుంది.. ’ అంటూ జుబేర్ ఆస్పత్రిలో తనను కొట్టిన వారిపై కూడా కోపం లేదని గొప్ప మాట చెప్పాడు.