Begin typing your search above and press return to search.
వైరల్ పోస్ట్: వైద్యం అధమం.. అంబానీ, అదానీలకు అ‘ధనం’
By: Tupaki Desk | 19 April 2021 10:30 AM GMTదేశంలో కరోనా కల్లోలం మరోసారి చోటుచేసుకుంది. కేసుల సంఖ్య జెట్ స్పీడుగా పెరుగుతోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ దీన్ని అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైంది. గత సంవత్సరం ఇదే అనుభవాలు చూసిన కేంద్రం ఈసారి కూడా వాటినే ఎదుర్కోవడం.. కనీస జాగ్రత్తలు తీసుకోకవడం చూసి అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా దేశంలో రెండో కరోనా వేవ్ రావడం.. మోడీ సర్కార్ వైఫల్యంపై నెటిజన్లు తమ దైన శైలిలో సెటైర్లు గుప్పిస్తున్నారు. దేశంలో సంవత్సరకాలంలో వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు పెరగలేదని.. కానీ ఈ సంవత్సరంలో గుజారాతీ వ్యాపారులు ముఖేష్ అంబానీ, గౌతం అదానీల సంపద పెరిగిందని ఎద్దేవా చేస్తున్నారు.
కేసుల ఉధృతి, బెడ్స్ కొరత దేశంలో తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ ఎవరికీ అందడం లేదు. వెంటిలేటర్స్ కొరతతో రోగులు చనిపోతున్నారు. మందుల కొరత పీక్స్ స్టేజీకి చేరింది. ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేక జనాలు హాహాకారాలు చేస్తున్నారు.
ఇప్పుడు ఇదే విషయంపై తమ క్రియేటివిటీని జోడించి సృజనాత్మకంగా పోస్టులు పెడుతున్నారు. వాటిని సోషల మీడియాలో వైరల్ చేస్తున్నారు.