Begin typing your search above and press return to search.

వైరల్: జోష్ గా కోహ్లీ బర్త్ డే వేడుకలు

By:  Tupaki Desk   |   5 Nov 2020 10:00 PM IST
వైరల్: జోష్ గా కోహ్లీ బర్త్ డే వేడుకలు
X
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. వన్డేలు, టీ20లు, టెస్టులు అన్ని ఫార్మాట్లలోనూ విరాట్ పేరిట రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తర్వాత స్థానం విరాట్ దే.

దేశ క్రికెట్ లో ఎన్నో ఘనతలు, రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ బర్త్ డే నాడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోహ్లీ నేటితో 32వ ఏటకు అడుగుపెడుతున్నాడు.

ఐపిఎల్ ఆర్సీబీ టీమ్ విరాట్ కోహ్లీకి ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. రెడ్ అండ్ గోల్డ్ కు రక్తాన్ని, స్వేచ్ఛను, కన్నీల్లను ఇచ్చిన వ్యక్తికి ఆర్సీబీ జట్టు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. లీడర్ అండ్ లెజెండ్ అంటూ ప్రశంసలు తెలిపింది.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఆడుతున్నాడు.యూఏఈలో ఉన్న కోహ్లీ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరడంతో జట్టు సభ్యులంతా బుధవారం ఆర్సీబీ టీం సమక్షంలో బర్త్ డే నిర్వహించారు. కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి కేక్ ను కట్ చేశాడు.

కోహ్లీ బర్త్ డేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీ షేర్ చేశారు.