Begin typing your search above and press return to search.

జనసేనకు ఫ్యామిలీ ప్యాక్ ఇమేజ్.. సాక్ష్యం ఈ ఫోటోనే

By:  Tupaki Desk   |   19 Jun 2023 11:35 AM GMT
జనసేనకు ఫ్యామిలీ ప్యాక్ ఇమేజ్.. సాక్ష్యం ఈ ఫోటోనే
X
రాజకీయ పార్టీలు అన్న తర్వాత లక్షలాది మంది పాలోయర్స్ ఉండటం తెలిసిందే. రాజకీయ పార్టీ అన్నంతనే యువత నుంచి పెద్ద వయస్కుల మధ్య ఉండటం చూస్తుంటాం. ఇక.. రాజకీయ సభలు.. రాజకీయ విమర్శల విషయంలో మహిళల కంటే పురుషులే యాక్టివ్ గా ఉండటం కనిపిస్తుంది. ఎన్నికల వేళలో ఓటర్లు వేసే క్రమంలో మహిళల ఓట్లు కీలకంగా మారినా.. వారు వేసే ఓటు విషయంలో తమ మీద ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. తమకు నచ్చిన వారికే ఓటు వేయటం కనిపిస్తూ ఉంటుంది.

ఎన్నికలు కాకుండా విడి రోజుల్లో రాజకీయాల మీద అంతగా ఆసక్తి చూపటం కనిపించదు. ఇక.. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు.. సమావేశాల కు.. బహిరంగ సభల కు.. నిరసనల కు.. ఆందోళనల కు మహిళలు.. పురుషులు పాల్గొన్నా.. వారిలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం తోనే ఏదైనా సభను నిర్వహించినప్పుడు మహిళల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయటం కనిపిస్తుంది.

అయితే.. రోటీన్ రాజకీయ పక్షాల కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు జనసైన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర సందర్భంగా రేర్ సీన్లు ఆవిష్క్రతమవుతున్నాయి. జనసేనా ని మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించే వేళ.. కొత్త పంథా దర్శనమిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీ అన్నంతనే యూత్.. పురుషులు ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా.. చిన్నారుల తో కలిసి ఫ్యామిలీ మొత్తం బైక్ మీద పార్టీ జెండా ను పట్టుకొని వెళుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో వ్యక్తి తన కుటుంబ సభ్యుల తో కలిసి బైక్ మీద వెళుతుంటే.. ఇద్దరు పిల్లలు బైక్ మీద ఉంటే.. వారి లో ఒకరు సీటు మధ్యలో నిలబడి.. చేతి లో పార్టీ జెండా పట్టుకోవటం కనిపిస్తుంది. ఆ పిల్లాడ్ని పట్టుకునేందుకు వెనుక కూర్చున్న మహిళ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.

దీంతో పాటు మరో చిన్నారి కూడా ఇద్దరి మధ్యన కుర్చోవటం.. వారంతా తమ ఊరికి వస్తున్న జనసేనాని కి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఈ పిక్ వైరల్ గా మారింది. జనసేనకు మిగిలిన రాజకీయ పార్టీల కు భిన్నంగా ఫ్యామిలీ ప్యాకేజీ అన్నట్లుగా తాజా పిక్ ఉందన్న మాట వినిపిస్తోంది. జనసేన కు ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందన్న విషయం చెప్పకనే చెప్పేసినట్లుగా ఉందంటున్నారు.