Begin typing your search above and press return to search.

వైరల్: నవ వధువు శోభనం బెడ్ పై.. వరుడు కంప్యూటర్ తెర పై..

By:  Tupaki Desk   |   10 Feb 2021 11:30 PM GMT
వైరల్: నవ వధువు శోభనం బెడ్ పై.. వరుడు కంప్యూటర్ తెర పై..
X
యువకులంతా ఆ క్షణం కోసం పరితపిస్తారు.. ప్రాధేయపడుతారు. కళ్లు కాయేలా ఎదురుచూస్తారు. శోభనం రోజు తమ బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి తెగ ఎంజాయ్ చేస్తారు. మనిషి జీవితంలోనే తొలిరాత్రికి ఎంతో ప్రాముఖ్యత విశేషం ఉంది. అలాంటి రాత్రి కోసం ఎంతో మంది ఇప్పటికీ ఎదురుచూస్తుంటారు. ఆరోజు రాత్రంతా రెచ్చిపోతుంటారు. మంచాలు విరగొట్టే పురుష పుంగవులు ఉంటారనుకోండి..

అయితే అలానే కలలుగని వెళ్లిన ఓ నవ వధువుకు పెళ్లికొడుకు షాకిచ్చాడు. శోభనం గదిలోనే దుకాణం తెరిచాడు. పెళ్లి కూతురు శోభనం బెడ్ పై ఆశగా చూస్తుండగా 'వర్క్ ఫ్రం హోం' అంటూ ఆ శోభన కార్యాన్ని పక్కనపెట్టి కంప్యూటర్ తెరముందు వరుడు వాలిపోయి పనిమీద పడ్డాడు..

దీంతో ఎంతో ఆశతో శోభనం కోసం ఎదురుచూస్తున్న ఆ నవ వధువు ముఖం వాలిపోయింది. వరుడు మాత్రం ఆ కంప్యూటర్ తెర ముందు కొంపలు మునిగిపోయినట్టు పనిచేస్తూనే ఉన్నాడు.ఈ అరుదైన, నవ్వు తెప్పించే ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో? ఎలా జరిగిందో కానీ శోభనాన్ని సైతం 'వర్క్ ఫ్రం హోం' కష్టాలు వదలడం లేదని తెలుస్తోంది. అంతా కరోనా తెచ్చిన మాయ ఇదీ..