Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్​లో చెలరేగిన హింస..జరుగుతున్న వరస ఘటనలు

By:  Tupaki Desk   |   1 Nov 2020 10:30 AM GMT
ఫ్రాన్స్​లో చెలరేగిన  హింస..జరుగుతున్న వరస ఘటనలు
X
ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో హింస చెలరేగింది. చర్చిలో ప్రార్థనలు ముగించుకొని బయటకు వస్తున్న ఫాదర్​పై కొందరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడికి తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు వెంటనే సంఘటనా ఘటనస్థలానికి చేరుకొని ఓ అనుమానితుడిని అరెస్ట్​ చేశారు. కాల్పులకు గల వివరాలు ఇంకా తెలియరాలేదని.. దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ప్రాన్స్​లో వరస ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నైస్​ నగరంలోనూ చర్చిలో దుండగులు ముగ్గురిని హత్య చేశారు. ఇస్లామిస్ట్ ఉగ్రవాదులే ఈ హత్యలు చేశారని ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మెక్రాన్​ ప్రకటించడం గమనార్హం.

అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు.ఫ్రాన్స్‌లోని బహిరంగ ప్రదేశాల్లో, ప్రార్థనా స్థలాల్లో అదనపు సైనిక బలగాలను మోహరించారు. పటిష్ట బందోబస్తు చేపట్టారు.

అయినప్పటికీ లియోన్‌లో శనివారం ఫాదర్ పై కాల్పులు జరపడం చర్చనీయాంశం అయ్యింది. ఒక వ్యక్తి సాన్-ఆఫ్ షాట్‌గన్‌తో కాల్పులు జరిపి అక్కడనుంచీ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బంది, అత్యవసర సిబ్బంది స్థానికులతో అక్కడి ప్రదేశాలను ఖాళీ చేయించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాలతో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని లియోన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నికొలాస్ తెలిపారు. కాల్పుల్లో గాయ పడిన చర్చి ఫాదర్‌ను నికొలాస్ కకా వెలకిస్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పొత్తికడుపులో రెండు సార్లు కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రాన్స్​లో జరుగుతున్న వరస ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉగ్రవాదులు ఈ దాడులు జరిపిఉంటారని పోలీసుల భావిస్తున్నారు.