Begin typing your search above and press return to search.
19 ఏళ్ల బాలుడి అర్ధరాత్రి పరుగు.. వైరల్ వీడియో
By: Tupaki Desk | 22 March 2022 12:30 AM GMT19 ఏళ్ల బాలుడు అర్ధరాత్రి నడిరోడ్డుపై పరుగులు తీస్తున్న వీడియో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. భారత సైన్యంలో చేరాలనేది ఆ అబ్బాయి కల. దాదాపు 12 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి 'లిఫ్ట్' కానీ ఉచిత రైడ్‌ని కానీ అతడు తీసుకోవడం లేదు. వాకింగ్, రన్నింగ్ నే నమ్ముకొని ఎవరైనా లిఫ్ట్ ఇద్దామన్నా తిరస్కరించాడు. పదే పదే చాలా మంది కారు ఎక్కు అని చెప్పినప్పటికీ ఆ బాలుడు సున్నితంగా తిరస్కరించాడు.
దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలో జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది. ఆ బాలుడి వీడియోను చిత్ర నిర్మాత వినోద్ కప్రీ వీడియో తీశారు. నోయిడాలోని సెక్టార్ 16లోని మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్న ప్రదీప్ మెహ్రా అనే బాలుడు అర్ధరాత్రి పరిగెడుతున్న వీడియోను నిర్మాత షేర్ చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్, బరోలాలో తన సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు, అతని తల్లి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు.
మెక్‌డొనాల్డ్స్‌లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన షిఫ్ట్ తర్వాత వీధిలో నడుస్తున్న ప్రదీప్‌ని చిత్రనిర్మాత వినోద్ కపిర్ గుర్తించాడు. వినోద్ స్వయంగా కారులో వెళుతూ ప్రదీప్ ను చూసి ఆపాడు. ప్రదీప్ ను ఇంటికి ఉచిత కారులో దించుతానని ఆఫర్ చేశాడు. పదే పదే అడిగాడు. కానీ ఆ బాలుడు ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. మీరు ఎందుకు పరిగెత్తుతున్నారని అడిగినప్పుడు.. ప్రదీప్ 'తాను భారత సైన్యంలో చేరాలనుకుంటున్నానని, ఉదయం పరుగెత్తడానికి సమయం దొరకదని.. అందుకే అర్ధరాత్రి పరిగెడుతున్నానని' చెప్పాడు.
ఇంటికి వెళ్లాక.. తనకూ, తన సోదరుడికీ వంట చేస్తానని చెప్పాడు. చివరకు నిర్మాత వినోద్ అతడి స్ఫూర్తికి ఫిదా అయ్యి అతడికి ఆహారం అందించాడు. కానీ ప్రదీప్ ఆహారాన్ని కూడా సున్నితంగా తిరస్కరించాడు. తాను ఆహారం తింటే తన సోదరుడు ఆకలితో అలమటిస్తాడని అన్నాడు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే తన సోదరుడికి కూడా అతను ఆహారం వండాలని అందుకే నిర్మాత ఆహారాన్ని తిరస్కరిస్తున్నట్టు తెలిపారు..
ఆదివారం సాయంత్రం ఈ బాలుడి వీడియోను వినోద్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోను 3.8 మిలియన్లకు పైగా మంది వీక్షించారు. 12 గంటల్లోనే 153,000 లైక్‌లను దాటింది. ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది.

వీడియో క్లిప్ వైరల్ అవుతుందని వినోద్ కప్రీ ముందే చెప్పడం కనిపించింది. "నన్ను ఎవరు గుర్తిస్తారు?" అని బాలుడు పరిగెడుతూ అన్నాడు. "ఇది వైరల్ అయితే ఫర్వాలేదు, నేను తప్పు చేస్తున్నట్టు కాదు" అని ప్రదీప్ అప్పుడే బదులిచ్చాడు.