Begin typing your search above and press return to search.

రెజ్లింగ్ క్రీడాకారులకు తప్పని లైంగిక వేధింపులు..?

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:55 AM GMT
రెజ్లింగ్ క్రీడాకారులకు తప్పని లైంగిక వేధింపులు..?
X
రెజ్లింగ్(కుస్తీ) పోటీల్లో పాల్గొనే మహిళలకు సైతం లైంగిక వేధింపులు తప్పలేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఆరోపణలు చేసింది సాధారణమైన క్రీడాకారిణి అయితే ఏదో అనుకోవచ్చు గానీ.. భారత్ కు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

స్టార్ రెజర్లు వినేశ్ ఫొగాట్.. భజరంగ్ పునియా తదితర క్రీడాకారులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌.. కోచ్‌లు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ నిన్న ధర్నాకు దిగారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే తప్పించాలని వారంతా డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అనంతరం మీడియాతో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై పలు సంచలన ఆరోపణలు చేసింది. మహిళా రెజ్లర్లను కోచ్‌లతోపాటు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ లైంగికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బ్రిజ్ భూషణ్ వల్ల తాను ఓసారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించింది.

మా మనస్సు తగిలిన గాయాల గురించి ఎవరూ పట్టించుకోరని ఆమె అన్నారు. ఆయనపై తాను గతంలో ఫిర్యాదు చేయగా తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయంటూ వాపోయింది. మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా మాట్లాడుతూ రెజర్లకు కనీస గైరవం ఇవ్వకుండా తిట్టడంతో పాటు కొట్టేవారని ఆరోపించింది.

ఫెడరేషన్‌లో ఉన్నవారికి ఆట గురించి సరైన అవగాహన లేదన్నారు. రెజ్లర్లను వారు చాలా వేధిస్తున్నారని ఆరోపించింది. బ్రిజ్‌ భూషణ్‌ తమను తిట్టడంతోపాటు చేయి కూడా చేసుకునేవాడని వాపోయింది. తమ పోరాటం ప్రభుత్వం.. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాపై కాదని.. కేవలం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌పైనేనని ఆమె స్పష్టం చేసింది.

బ్రిజ్‌ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేవరకు తాము ధర్నా కొనసాగిస్తామని సుమారు 30మంది స్టార్ రెజర్లు స్పష్టం చేశారు. అప్పటిదాకా ఏ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనబోమని వారంతా స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను మాత్రం బ్రిజ్ భూషణ్ ఖండించారు.తనపై ఓ పారిశ్రామిక వేత్త చేస్తున్న కుట్రని.. తాను లైంగికంగా వేధించాననని నిరూపిస్తే ఉరేసుకుంటానని తెలిపారు. తాను రెజ్లింగ్ అధ్యక్షపదవీకి రాజీనామా చేసేలేదని తెగేసి చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.