Begin typing your search above and press return to search.

భీమ్లా నాయక్‌ లో నా పాత్ర..!

By:  Tupaki Desk   |   19 Aug 2021 4:59 AM GMT
భీమ్లా నాయక్‌ లో నా పాత్ర..!
X
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు రీమేక్‌ గా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ మరియు రానాలు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ పోలీస్‌ గా కనిపించబోతున్నాడు. మాస్ గా లుంగీ కట్టుకుని పవన్‌ అలా నడిచి వస్తున్న షాట్స్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వి వి వినాయక్ నటిస్తున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. వినాయక్‌ షూటింగ్‌ లో కూడా పాల్గొన్నాడు అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వి వి వినాయక్‌ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్‌ లో నేను కనిపించబోతున్న మాట వాస్తవం. నా రియల్‌ పాత్రలో నేను కనిపించబోతున్నాను. అంటే దర్శకుడు వి వి వినాయక్ పాత్రలోనే ఆయన కనిపించబోతున్నాడన్నమాట. రానా కాంబోలో ఉండే సన్నివేశాల చిత్రీకరణలో ఇప్పటికే వినాయక్‌ పాల్గొన్నట్లుగా చెప్పుకొచ్చాడు. రానాతో పోయి పోయి వాడితో ఎందుకు పెట్టుకున్నావు అనే డైలాగ్‌ నాదే అంటూ వినాయక్ చెప్పుకొచ్చాడు. భీమ్లా నాయక్‌ సినిమాలో వినాయక్ పాత్ర పెద్దగా ఉంటుంది.. ఇంకా ఏదో ఏదో ఊహించుకుంటున్న వారికి ఇది పెద్ద షాక్‌ అనక తప్పదు.

వినాయక్ చిన్న పాత్రలో కనిపించినా కూడా ఉన్నంత సమయం ప్రత్యేకంగా సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా లో పవన్‌ సాలిడ్ మాస్ గెటప్ తో పాటు ఆయన భార్య పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మరియు రానాల కాంబోలో వచ్చే సన్నివేశాలు చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంటాయని అంటున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటలు మరియు స్క్రీన్‌ ప్లేను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అందిస్తున్న విషయం తెల్సిందే.