Begin typing your search above and press return to search.
బండిపై గులాబీ ఫైర్: బలిసిందా? నాలుక చీరేస్తాం బిడ్డా!
By: Tupaki Desk | 7 Jan 2021 4:14 AM GMTతెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు బీజేపీ నేతలు చెలరేగిపోతుండగా.. వారికి ఏ మాత్రం తీసిపోనట్లుగా రియాక్టు అయ్యారు గులాబీ నేతలు. తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒకేరోజు ఇద్దరు అధికారపక్ష నేతలు బండి సంజయ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో గులాబీ నేతల్లో కొరవడిన దూకుడును ప్రదర్శించిన వారు.. సీఎం కేసీఆర్ నే విమర్శిస్తావా? ఎంత ధైర్యం అన్న రీతిలో ప్రశ్నించటం సరికొత్తగా ఉందని చెప్పాలి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆ నగరంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది బీజేపీ. గడిచిన కొద్దిరోజులుగా కమలనాథులు.. ఓరుగల్లు మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తాజాగా బండి సంజయ్ హాజరైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎప్పటిలానే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఊహించని రీతిలో స్పందించారు ఎమ్మెల్యే కమ్ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఖబడ్డార్ బండి అంటూ హెచ్చరించారు. కేసీఆర్ పై నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తాం బిడ్డా అన్న ఆయన.. బండి సంజయ్ ను తొండి సంజయ్ గా అభివర్ణించారు. ఎన్నికలు రాగానే సంజయ్ కు చార్మినార్.. భద్రకాళి ఆలయం గుర్తుకు వస్తుందని.. వరంగల్ కు వరదలు వచ్చిన సమయంలో వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు.
చారిత్రక నగరమైన వరంగల్ కు కేంద్రం ఏం చేసిందన్న దాస్యం.. దమ్ముంటే రామప్ప దేవాలయానికి హెరిటేజ్ గుర్తింపు తీసుకురావాలని సవాలు విసిరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగానికి సిద్ధపడి.. టీఆర్ఎస్ నేతలంతా ఉద్యమాలు చేస్తున్నప్పుడు బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన జయశంకర్సార్ సమాధి స్థలాన్ని కూడా బీజేపీ నేతలు వివాదం చేస్తున్నారని.. సంజయ్ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే.. ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు.
ఇదిలా ఉంటే మరో ఎమ్మెల్యే కమ్ టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ మరింతగా మండిపడ్డారు. బండి సంజయ్ కు నేరుగా వార్నింగ్ ఇచ్చిన ఆయన.. కేసీఆర్ పై ఎవరూ విమర్శలు చేయకూడదని కొత్త వాదాన్ని వినిపించారు. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ థాకరే గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే సేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో.. తెలంగాణలో కూడా అలా స్పందించాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి. సీఎం కేసీఆర్ ను అవహేళన చేస్తూ మాట్లాడితే ఊరుకోం. లేనిపక్షంలో తాట తీస్తాం. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి’ అని మండిపడ్డారు. కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు చేయటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాల్క సుమన్.. ‘ఏం బలిసిందా.. బండి సంజయ్. సమయం.. సందర్భం కోసం వేచి చూస్తున్నాం. టైం వచ్చినప్పుడు అందరి లెక్కలు తీస్తాం. సీఎంపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదు’ అని హెచ్చరించారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యల తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు.