Begin typing your search above and press return to search.
తెలంగాణలో సరికొత్త ట్రెండ్.. సెల్ఫ్ లాక్ డౌన్
By: Tupaki Desk | 6 April 2021 9:24 AM GMTచూస్తుండగానే.. పదుల సంఖ్యలో ఉన్న కేసులు వందల్లోకి.. ఆ వెంటనే వేలల్లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. నెల క్రితం వరకు పెద్దగా లేని కరోనా పాజిటివ్ కేసులు.. గడిచిన రెండు వారాలుగా మహమ్మారి జోరు అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో.. జాగ్రత్తలు పడే వారు జాగ్రత్తలు పడుతున్నారు. పట్టించుకోని వారు పట్టించుకోకుండా తమకు తోచినట్లు ఉండిపోతున్నారు. మహమ్మారి ముప్పు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. కేసుల్ని కట్టడి చేయటానికి ఏం చేయాలన్నది ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది.
ఇలాంటివేళ.. తెలంగాణలోని కొన్ని పల్లెల్లో కేసులు బయటకు వచ్చినంతనే.. వారు తమకు తాముగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుంటున్న వైనం కొత్త స్ఫూర్తిగా మారిందని చెప్పాలి. ఇటీవల జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్లోని గ్రామస్థులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం పంచాయితీలో ప్రత్యేకంగా తీర్మానం చేశారు. వరంగల్ అర్భన్ జిల్లా కడిపికొండ గ్రామంలోనూ ఇలాంటి తీర్మానమే చేశారు.పదిహేను రోజుల పాటు స్వీయ లాక్ డౌన్ విధించుకున్నామని.. తమ ఊరికి ఎవరూ రావొద్దని చాటింపు వేయటం గమనార్హం.
ఇంతకీ ఆ ఊళ్లో అలాంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణం.. ఒకేసారి 20 కేసులు బయటకు రావటం.. అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన వారు 13 మంది ఉండటంతో గ్రామస్థులంతా ఒకే కట్టుమీద ఉండి లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలా తెలంగాణలోని కొన్ని గ్రామాల వారు తమ ఊళ్లో కరోనా కేసులు వెలుగు చూసినంతనే.. తమ ఊరి వరకూ స్వీయ లాక్ డౌన్ విధించుకొని మహమ్మారి మరింత విస్తరించకుండా చర్యలు తీసుకోవటం గమనార్హం.