Begin typing your search above and press return to search.
మూగ జీవాలపై కర్కశత్వం ... నీళ్ల కోసం వచ్చిన కోతికి ఉరి !
By: Tupaki Desk | 29 Jun 2020 6:50 AM GMTనోరు లేని ముగా జీవాల పట్ల అమానుష ఘటనలు ఆగడం లేదు. కొంతమంది నీచులు తమ పైశాచికత్వాన్ని మూగజీవాలపై చూపిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. నీటి తొట్టిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని మానవతా దృక్పథంతో కాపాడాల్సింది పోయి… ఆ కోతిని ఉరి తీసి చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే... ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం లోకి ఈ నెల 26వ తేదీన ఓ కోతి దండు వచ్చింది. వాటిని సాధు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతి కలిసి తరిమారు. ఆ క్రమంలో ఓ కోతి నీరు తాగేందుకు ప్రయత్నించి తొట్టె లో పడి పోయింది. దాన్ని పట్టుకున్న ఆ ముగ్గురు చెట్టు కు వేలాడదీశారు. ఒక కోతిని చంపేస్తే మరో సారి కోతులు ఆ ప్రాంతానికి రావడానికి భయపడుతాయని.. దాన్ని చెట్టుకు ఉరేసి కుక్కలతో కరిపిస్తూ, కర్రలతో కొట్టి చంపారు. ప్రాణాల కోసం అది విలవిల లాడుతుంటే అక్కడున్న వారు క్రూర నవ్వును నవ్వారు. ఆ తరువాత శివారు ప్రాంతంలో కోతి మృతదేహాన్ని పడేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఫారెస్ట్ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. కోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన సాధు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతిలను అరెస్ట్ చేశారు. విచారణ తరువాత ముగ్గురిపై కేసు నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున జరిమానా విధించారు. అడవి లో ఆహారం లేక రోడ్లపైకి వస్తున్న మూగజీవాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కుదిరితే వాటికి ఆహారం అందించాలి తప్ప ఈ విధంగా కర్కశంగా ప్రవర్తించి కూడదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.