Begin typing your search above and press return to search.

17 మంది గ్రామ వాలంటీర్ల పై వేటు ..ఏం చేశారంటే ?

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:37 PM GMT
17 మంది గ్రామ వాలంటీర్ల పై వేటు ..ఏం చేశారంటే ?
X
పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లపై వేటు వేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ వీరు ఏంచేశారు అనుకుంటున్నారా ! తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళల కోసం వైఎస్సార్ చేయూత పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే , వైఎస్సార్ చేయూత పథకంలో అనర్హులను గుర్తించడంలో విఫలమైనందుకు 17 మంది గ్రామ వాలంటీర్ల పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.

కాగా, నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు, విదేశాల్లో ఉన్న వారు వైఎస్సార్‌ చేయూతకు అనర్హులు. కానీ ఆ మండలంలోని వివిధ గ్రామాల్లో అర్హత లేని 21 పేర్లను పథకంలో నమోదు చేసినందుకు వీరిపై చర్యలు తీసుకున్నారు. అలాగే , ఈ విషయంలో 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ లకు కూడా షోకాజ్ నోటీసులు అందజేశారు.