Begin typing your search above and press return to search.
గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల లొల్లి!
By: Tupaki Desk | 2 Aug 2019 2:30 PM GMT'మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నాం.. వాలంటీర్ల టెస్టులో మంచి మార్కులు కూడా పడే ఉండాలి… కానీ మాకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వలేదు..' అని వాపోయే వాళ్లు కొందరు. 'ఆ ఉద్యోగాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకే పంచేశారు..' అంటూ ఇంకొందరు. 'మా ఎమ్మెల్యే ఆ ఉద్యోగాలను అమ్ముకున్నాడు..' అంటూ కొందరు. 'ఎమ్మెల్యే మనుషులు ఆ ఉద్యోగాలను అప్పనంగా కొట్టేశారు..' అంటూ ఇంకొందరు.
ఇలా గ్రామ వలంటీర్ ఉద్యోగాల విషయంలో గ్రామీణ యువకుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. పంచాయతీకి కొన్ని ఉద్యోగాలుగా జరిగిన ఆ నియామకాల విషయంలో అసంతృప్తులు కనిపిస్తున్నారు.
ఆ ఉద్యోగం దక్కిన వారు మారు మాట్లాడటం లేదు కానీ, అది దక్కని వారు మాత్రం రకరకాలుగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము మంచి టాలెంటెడ్ అయినా తమకు ఆ ఉద్యోగం దక్కలేదని.. అదంతా లాబీయింగ్ ఫలితం అని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఆశించిన ఉద్యోగం దొరకని వారు సహజంగానే అసంతృప్తితో ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం కదా. అలాంటి వాళ్లు ఈజీగా తమ అసంతృప్తిని చాటే అవకాశం ఉంది. ఇలా పల్లెల్లో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల లొల్లి కొనసాగుతూ ఉంది.