Begin typing your search above and press return to search.

గ్రామ వలంటీర్ల ఉద్యమబాట

By:  Tupaki Desk   |   7 Feb 2021 9:30 AM GMT
గ్రామ వలంటీర్ల ఉద్యమబాట
X
ఏపీ సీఎం జగన్ మానస పుత్రిక ‘సచివాలయ వ్యవస్థ’. దేశంలోనే ఇదో గొప్ప సంస్కరణ.. పాలనను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయికి డైరెక్టుగా అందించే వ్యవస్థ. గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువులుగా సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. అందుకే ఈ పథకంపై దేశవ్యాప్తంగా మేధావులు , రాజకీయ నాయకులు జగన్ పై ప్రశంసలు కురిపించారు. వేయినోళ్ల పొగిడారు. కాబోయే ఐఏఎస్, ఐపీఎస్ లకు సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ‘సచివాలయ వ్యవస్థ’పై శిక్షణ కూడా ఇచ్చారంటే ఈ పథకం గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత గొప్ప వ్యవస్థలో కీలక పాత్రదారులైన వలంటీర్లు మాత్రం చాలీచాలనీ జీతాలపై పోరుబాట పట్టడం ఇప్పుడు సంచలనమైంది.

ఏపీ గ్రామ పంచాయతీ వలంటీర్లు ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. గుంటూరులోని కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సమావేశమైన వీరు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తమకు నెలకు రూ.5వేలు మాత్రమే ఇస్తూ అన్ని పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్లకు వేతనాలు పెంచి.. వారికి 16వేలు ఇస్తూ తమకు మాత్రం చాలీచాలని జీతాలు ఇవ్వడంపై వలంటీర్లు అంతా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇంటింటికి రేషన్ కోసం వాహనదారులకు సబ్సిడీపై ప్రభుత్వం వాహనాలు ఇచ్చి ఇంటింటికి రేషన్ పంపిణీ చేయమని చెప్పింది. నాలుగేళ్ల తర్వాత వాహనం వారి సొంతమవుతుంది. ప్రభుత్వం ఒక్కో వాహనాన్ని రూ.5.8 లక్షలకు కొనుగోలు చేసింది. అందులో 10శాతం అంటే రూ.58వేలు చెల్లించి వాహనదారుడు వాహనాన్ని తీసుకున్నాడు. వీరికి నెల రూ.16వేల వేతనాన్ని ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇస్తోంది.

వాహనాల డ్రైవర్లకు వేతనాలు పెంచి తమకు పెంచకపోవడంపై వలంటీర్లు పోరుబాట పడుతున్నారు.తమకూ వేతనాలు పెంచి, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమబాట పడుతామని హెచ్చరించారు.