Begin typing your search above and press return to search.

ఆ మోడ‌ల్‌ ను చంపింది ఆ హీరోనేన‌ట‌!

By:  Tupaki Desk   |   31 May 2017 8:27 AM GMT
ఆ మోడ‌ల్‌ ను చంపింది ఆ హీరోనేన‌ట‌!
X
చిన్న చిన్న త‌ప్పులే పెద్ద పెద్ద క‌ష్ట్రాల్ని తీసుకొచ్చాయి. తాజాగా యువ బెంగాలీ హీరో విక్ర‌మ్ ఛ‌ట‌ర్జీ వ్య‌వ‌హారం చూస్తే ఇది నిజ‌మ‌నించ‌క త‌ప్ప‌దు. నిర్ల‌క్ష్యంతో అత‌గాడు చేసిన త‌ప్పు ఇప్పుడు అత‌ని మెడ‌కు చుట్టుకోవ‌ట‌మే కాదు.. హ‌త్య నేరాన్ని ఆయ‌న ఎదుర్కొంటున్నారు. ఫుల్ గా తాగేసి నిర్ల‌క్ష్యంగా వాహ‌నాన్ని న‌డిపిన అత‌డు ఇప్పుడు చిక్కుల్లో ప‌డిపోయారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

ఏప్రిల్ 29న కోల్ క‌తాలోని బెంగాలీ యువ హీరో విక్ర‌మ్‌.. న‌టి క‌మ్ మోడ‌ల్ సోనియాలు ఒక కారులో ప్ర‌యాణిస్తున్నారు. వీరు ప్ర‌యాణిస్తున్న కారు డివైడ‌ర్‌ను ఢీ కొట్ట‌టంతో ఘ‌ట‌నాస్థ‌లంలోనే మోడ‌ల్ సోనియా మ‌ర‌ణించింది. ఈ ఉదంతంలో త‌ల‌కు గాయ‌మైన విక్ర‌మ్‌ను స్థానికుల సాయంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇంత‌కీ ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని చూస్తే.. విక్ర‌మ్ ఫుల్ గా మ‌ద్యం సేవించి.. ర్యాష్ డ్రైవింగ్‌తోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు.

తాగి వాహ‌నాన్ని న‌డిపిన‌ప్ప‌టికి.. తాను మ‌ద్యం సేవించ‌లేదంటూ విక్రం పోలీసుల‌కు వెల్ల‌డించారు. అయితే.. పోలీసుల విచార‌ణ‌లో మాత్రం అత‌గాడు ఫుల్ గా తాగేసి కారును న‌డ‌ప‌టంతోనే ప్ర‌మాదం జ‌రిగింద‌ని గుర్తించారు.దీంతో అత‌నిపై మొద‌ట న‌మోదు చేసిన ర్యాష్ డ్రైవింగ్ నేరారోప‌ణ‌తో పాటు ఐపీసీ సెక్ష‌న్ 304 ను అభియోగం న‌మోదైంది. మోడ‌ల్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన హ‌త్య ఆరోప‌ణ‌లు ఆయ‌న మీద న‌మోదు చేశారు. హ‌త్య చేయ‌కున్నా.. మ‌ర‌ణించ‌టానికి కార‌ణ‌మైన నేప‌థ్యంలో ఆ హీరో మీద కేసు బుక్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ అభియోగం కానీ కోర్టులో నిరూపిత‌మైతే.. స‌ద‌రు యువ హీరోకి క‌నిష్ఠంగా 10ఏళ్లు జైలుశిక్ష ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/