Begin typing your search above and press return to search.

అబ్బాయి వికారాబాద్‌.. అమ్మాయి ఇండోనేషియా!

By:  Tupaki Desk   |   9 April 2018 6:38 AM GMT
అబ్బాయి వికారాబాద్‌.. అమ్మాయి ఇండోనేషియా!
X
ప్రేమ‌కు ప్రాంతం.. మ‌తం.. దేశాల‌తో సంబంధం ఉండ‌ద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక యువ‌కుడి ప్రేమ‌లో ప‌డింది ఇండోనేషియా అమ్మాయి. వారి ప్ర‌ణ‌యం పెళ్లికి చేరింది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు చెందిన సురేష్ గౌడ్ ప‌దేళ్ల క్రితం ఎంఎస్ చ‌ద‌వ‌టానికి ఆస్ట్రేలియా వెళ్లాడు.

చ‌దువు త‌ర్వాత అక్క‌డే జాబ్ లో సెటిల్ అయ్యాడు. అదే కంపెనీలో ప‌ని చేస్తున్న ఇండోనేషియాకు చెందిన అన్న‌వితో మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కూ వ‌చ్చింది. వీరిద్ద‌రి పెళ్లికి ఇరు కుటుంబాలు ఓకే అన‌టంతో వీరి వివాహం ఆదివారం జ‌రిగింది.

పూర్తి హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన ఈ పెళ్లికి వేదిక‌గా చేవెళ్ల మండ‌లం ఇంద్రారెడ్డి న‌గ‌ర్ మారింది. ఈ పెళ్లి కోసం పెళ్లి కుమార్తె త‌ల్లితోపాటు.. చెల్లెలు.. అన్న‌య్య‌లు ఇండోనేషియా నుంచి వ‌చ్చారు. తెలుగింటి పెళ్లికూతురుగా ముస్తాబైన ఇండోనేషియా అమ్మాయిని చూసేందుకు స్థానికులు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు.