Begin typing your search above and press return to search.

రెండో రౌండ్లో కింద పడ్డోడు మళ్లీ లేవల

By:  Tupaki Desk   |   20 Dec 2015 10:03 AM GMT
రెండో రౌండ్లో కింద పడ్డోడు మళ్లీ లేవల
X
మొరిగే కుక్కలు కరవన్న ముతక సామెత కాస్త ఇబ్బంది కలిగించినా? తాజా ఉదంతం చూసినప్పుడు మాత్రం ఈ మాటే నిజమనిపించక మానదు. ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీకి సంబంధించి భారత స్టార్ ఆటగాడు విజేందర్ తో..బల్గేరియన్ బాక్సర్ సామెట్ హుసినోవ్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి వారం ముందు సామెట్ చాలానే మాటలు మాట్లాడారు. రింగులో.. విజేందర్ కు చుక్కలు చూపిస్తానని చెప్పిన అతగాడు.. విజేందర్ ఎముకలు విరగొట్టి పంపుతానంటూ మాటలతో చెలరేగిపోయాడు.

మాటలతో అధిపత్యం సాధించాలనుకున్న ప్రత్యర్థి వ్యాఖ్యలపై పెద్దగా స్పందించని విజేందర్.. రింగులో చూసుకుందామని.. తాను ఒలింపిక్ పతకాన్ని సొంతం చేసుకున్న వాడినంటూ తన సత్తాను చాలా తక్కువ మాటల్లో శాంపిల్ గా చెప్పేశాడు. ఇలా మాటల యుద్ధం నడుమ.. పోటీ జరిగింది. మొత్తం ఆరు రౌండ్ల పాటు సాగాల్సిన ఆట కేవలం.. రెండు రౌండ్లతోనే ముగిసింది.

విజేందర్ ఎముకలు విరగొట్టి పంపుతానని ప్రగల్భాలు పలికిన సామెట్ ను రింగులో పిల్లిలా మారిపోయాడు. విజేందర్ సింగ్ ఇచ్చే పంచ్ లకు గుడ్లు తేలేశాడు. మొదటి రౌండ్ కే కిందామీదా పడిన అతగాడు.. రెండో రౌండ్ స్టార్టింగ్ లో విజేందర్ కుడిచేతి పిడికిలి సామెట్ ముఖం మీద బలంగా తాకటం.. అతగాడు కిందిపడిపోవటం.. మళ్లీ లేవకపోవటం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో.. ఆట ముగిసి.. విజేందర్ విజేతగా నిలిచారు. మరికొద్ది నెలల్లో జరిగే ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించాలన్న తన నమ్మకాన్ని తాజా పోటీ పెంచిందంటూ విజేందర్ ఎప్పటిలానే వినమ్రతతో తన ఆశయాన్ని చెప్పుకొచ్చారు. అందుకే.. ఆట ముందు మాటల కంటే ప్రాక్టీసు మీద ఫోకస్ చేస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పేది.